CM Mamata : బెంగాల్ సీఎం ‘బీఎస్ఎఫ్’ పై చేసిన ఆరోపణలకు స్పందించిన బీజేపీ

సీఎం మమత ఆరోపణలపై బీజేపీ స్పందించింది...

CM Mamata : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అస్థిర పరచేందుకు బీఎస్ఎఫ్ దేశంలోని చోరబాటుదారులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఇస్లాంపూర్ లోకి చోరబాటుదారులను బీఎస్ఎఫ్ దళాలు పంపుతున్నాయన్నారు. తద్వారా సితాయి, చోప్రా గుండా వారు రాష్ట్రంలోని ప్రవేశిస్తున్నారని తెలిపారు.అందుకు సంబంధించి సమాచారం తమ వద్ద ఉందన్నారు. అయితే సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న బీఎస్ఎఫ్ వారిని ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని తొరబడి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తే.. సహించేది లేదని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ అంశంపై విచారణ జరపాలని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్‍ను సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కోరారు.

CM Mamata Banerjee Comments

సీఎం మమత ఆరోపణలపై బీజేపీ స్పందించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కే.. బీఎస్ఎఫ్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. సీఎం మమతా బెనర్జీతోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో బీఎస్ఎఫ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఎందుకంటే.. మాదక ద్రవ్యాలు, మనుషులు, పశువుల అక్రమ రవాణాను బీఎస్ఎఫ్ దళాలు నియంత్రిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో టీఎంసీ నేతల ప్రమేయం ఉందని బీజేపీ నేత అనిర్బన్ గంగూలీ వెల్లంచారు.

ఇకబంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు ఏం మాత్రం అనుకూలంగా లేవని.. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ కు సహకరించాలని ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి బీజేపీ నేత గంగూలీ సూచించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత ఇబ్బందికరంగా మారాయని వివరించారు. అదీకాక.. బంగ్లాదేశ్ల లో హిందువులపై దాడులను నిలిపివేయాలని ఇప్పటికే బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కి భారత్ విజ్జప్తి చేసిందని గుర్తు చేశారు. ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య అనుచరుల్లో ఒకరైన డుయల్ సర్కార్ ను గురువారం ఉదయం ఆగంతకులు కాల్చి చంపారు. మాల్డాలో జిల్లాలో అతడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు. సర్కార్ హత్యను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకోవాలని ఉన్నతాధికారులను సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు.

Also Read : CMR College : మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళన

Leave A Reply

Your Email Id will not be published!