BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల ! చెన్నై సౌత్ నుంచి మాజీ గవర్నర్ తమిళి ‘సై’ !
బీజేపీ మూడో జాబితా విడుదల ! చెన్నై సౌత్ నుంచి మాజీ గవర్నర్ తమిళి ‘సై’ !
BJP Third List: లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ(BJP) అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుకు సంబంధించి తొమ్మిది స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవల తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను చెన్నై సౌత్ సీటు నుంచి బరిలో దించింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె భాజపాలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవ చేసేందుకే తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు తెలిపిన ఆమె… ఈ ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే కోయంబత్తూరు నుంచి బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై పోటీ చేస్తున్నారు.
BJP Third List – మూడో జాబితా బీజేపీ అభ్యర్థుల వీరే…
చెన్నై సౌత్ – డా. తమిళి సై సౌందరరాజన్
చెన్నై సెంట్రల్ – వినోజ్ పి.సెల్వం
వెల్లూరు – డా ఎ.సి. షణ్ముగం
కృష్ణగిరి – సి.నరసింహన్
నీలగిరిస్ (ఎస్సీ) డా. ఎల్. మురుగన్
కోయంబత్తూరు – కె. అన్నామలై
పెరంబలూరు – టి.ఆర్. పార్వేందర్
తూత్తుకుడి – నైనార్ నాగేంద్రన్
కన్యాకుమారి – పొన్. రాధాకృష్ణన్
బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేయగా… రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాగా 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. మొత్తంగా ఇప్పటి వరకు 275 మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370, ఎన్డీయే కూటమి 400 స్థానాలకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : CM Revanth Reddy: హోలీ పండగలోపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన – సీఎం రేవంత్రెడ్డి