Sourav Ganguly : ఓ వైపు కరోనా మరో వైపు ఓమిక్రాన్ థర్డ్ వేవ్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ఉన్నట్టుండి దేశీ వాలీ టోర్నీలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కార్యదర్శి జై షా. కేసుల పెరుగుదల కారణంగా ఈనెల చివరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీతో పాటు మరికొన్ని ట్రోఫీలను బీసీసీఐ నిర్వహించే ఆలోచనలో ఉంది.
ఇదిలా ఉండగా కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన వెంటనే అన్ని దేశీయ టోర్నీలను పునః ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) స్పష్టం చేశారు.
ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు నిశ్చింతగా ఉండాలని సూచించాడు దాదా. కేసుల కారణంగా ఈనెల చివరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీని, మరొకొన్ని టోర్నమెంట్ లను బీసీసీఐ అనుకోకుండా వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపాడు గంగూలీ.
ప్రస్తుతం కరోనా పరిస్థితి సీవియర్ గా ఉన్నందు వల్ల కొనసాగాల్సిన మ్యాచ్ లను , టోర్నీలను తాత్కాలికంగా నిలిపి వేయాల్సి వచ్చిందంటూ క్లారిటీ ఇస్తూ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)లేఖ రాశారు.
ఇదిలా ఉండగా రంజీ ట్రోఫీ, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ ఈ నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా సీనియర్ మహిళల టీ20 లీగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.
ప్రత్యేకించి క్రీడా సంఘాలు, క్రికెటర్లు, కోచ్ లు , ఇతర సిబ్బంది , నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు బీసీసీఐ చీఫ్. ఈ సందర్భంగా అధ్యక్షులు, కార్యదర్శులకు మెయిల్ లో రాశారు.
Also Read : టీ20 కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్