Mehish Hayat : పాక్ వరదలపై బాలీవుడ్ మౌనమేల
నిప్పులు చెరిగిన పాకిస్తాన్ నటి మెహ్విష్
Mehish Hayat : పాకిస్తాన్ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతటి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రకృతి కన్నెర్రకు దేశంలో భారీ ఎత్తున వరదలు వచ్చాయి. 5 లక్షల మందికి పైగా నిరాశ్రయులుగా మారారు.
1,300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. 8 లక్షల దాకా పశువులు చని పోయాయి. ఎక్కడ చూసినా వరదల బీభత్సపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.కంట తడి పెట్టిస్తున్నాయి. ఈ తరుణంలో భారత దేశ ప్రధాన మంత్రి మోదీ(PM Modi) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా పాకిస్తాన్ వరదల తాకిడికి తల్లడిల్లి పోతుంటే బాలీవుడ్ కు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు ఎందుకు స్పందించ లేదంటూ ఆ దేశానికి చెందిన నటి మెహ్విష్ హయత్ ప్రశ్నించారు.
ఒక రకంగా నిలదీశారు. మనుషులంతా ఒక్కటేనని ప్రధానంగా బాలీవుడ్ కు ఇక్కడ చెప్పలేనంత మంది అభిమానులు ఉన్నారని తెలిపారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
అంతే కాకుండా అమెరికన్ సూపర్ మోడల్ బెల్లా హడీద్ పాకిస్తాన్ వరద బాధితుల(Pakistan Floods) కోసం సాయం చేసే మార్గాల గురించి సమాచారం పంపమని తన అనుచరులను కోరారు.
అది వైరల్ గా మారింది. దీనిని మెహ్విష్(Mehish Hayat) ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. యావత్ ప్రపంచం స్పందిస్తోంది. కానీ బాలీవుడ్ ఎందుకో మనౌంగా ఉందని నిలదీశారు.
వారు రాజకీయాలకు అతీతంగా ఎదగాలని సూచించారు. పాకిస్తాన్ లోని తమ అభిమానుల గురించి కూడా శ్రద్ద చూపాలని బాలీవుడ్ ను కోరారు.
Also Read : టొరంటో ఫెస్టివల్ లో భారతీయ సినిమాలు