Boris Becker : బోరిస్ బెక‌ర్ కు రెండున్న‌రేళ్ల జైలు శిక్ష

ఆస్తుల‌ను దాచి పెట్టిన కేసులో తీర్పు

Boris Becker : మాజీ టెన్నిస్ స్టార్ , ప్ర‌స్తుతం కామెంటేట‌ర్ గా ఉన్న బోరిస్ బెక‌ర్(Boris Becker) కు కోలుకోలేని షాక్ త‌గిలింది. 2017 దివాలాకు సంబంధించిన ఆరోప‌ణ‌ల‌పై బ్రిటిస్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కీల‌క తీర్పు చెప్పింది.

బోరిస్ బెక‌ర్ కు రెండున్న‌ర ఏళ్ల పాటు శిక్ష విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇక బోరిస్ బెక‌ర్(Boris Becker) వ‌ర‌ల్డ్ లోనే టాప్ టెన్నిస్ స్టార్ గా పేరొందారు. ఆయ‌న త‌న కెరీర్ లో ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియ‌న్ గా ఉన్నారు.

54 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన బోరిస్ బెక‌ర్ త‌న వ్యాపార ఖాతా నుండి భారీ మొత్తంలో డ‌బ్బును బ‌దిలీ చేశారు. దాంతో లండ‌న్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టులో దోషిగా నిర్దారించింది. ఇందులో స‌గం ప‌ద‌వీ కాలం పూర్తి చేశాడు.

జ‌ర్మ‌నీలో ఆస్తిని ప్ర‌క‌టించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు బోరిస్ బెక‌ర్ . 8, 25 , 000 యూరోలు అప్పులు కాగా , టెక్ సంస్థ‌లో వాటాల‌ను దాచి పెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బెక‌ర్ పై 20 ఆరోప‌ణ‌లు న‌మోద‌యాయి.

ఇందులో నిర్దోషిగా బ‌య‌ట ప‌డ్డాడు. న్యాయ‌మూర్తి డెబోరా టేల‌ర్ ఆమె శిక్ష నిర్ణ‌యానికి ముందే ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ పై విడుద‌ల చేశారు. బెక‌ర్ త‌న భాగ‌స్వామి లిలియ‌న్ డికార్వాల్హో మోంటెరోతో చేతులు ప‌ట్టుకున్నాడు

. మాజీ ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ త‌న మొద‌టి భార్య బార్బ‌రా బెక‌ర నుంచి విడాకులు పొందాడు. పిల్ల‌ల నిర్వ‌హ‌ణ చెల్లింపులు, ఖ‌రీదైన జీవ‌న శైలి క‌ట్టుబాట్ల ద్వారా అత‌డి సంపాద‌న 40 మిలియ‌న్ల పౌండ్లు ఎలా పోగొట్టుకున్నాడో జ్యూరీకి తెలిపాడు బెక‌ర్.

Also Read : రోహిత్..కోహ్లీ ఫామ్ పై దాదా కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!