Boris Johnson : మోదీతో బోరిస్ జాన్సన్ భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చ

Boris Johnson : ఫైట‌ర్ జెట్ ల త‌యారీలో భార‌త్ కు స‌హాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్(Boris Johnson). రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న భార‌త్ కు వ‌చ్చారు. ముందుగా అహ్మ‌దాబాద్ లో ప‌ర్య‌టించారు.

అక్క‌డ మ‌హాత్మాగాంధీ స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సంద‌ర్శ‌న పుస్త‌కంలో మ‌హాత్ముడి జీవితం ఆద‌ర్శం అంటూ పేర్కొన్నారు. అనంత‌రం జేసీబీ త‌యారీ ప‌రిశ్ర‌మ‌ను సంద‌ర్శించారు.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అదానీ ఇచ్చిన విందుకు హాజ‌రయ్యారు. అక్క‌డి నుంచి నేరుగా గుజ‌రాత్ లోని అక్ష‌రధామ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి వ‌చ్చారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మోదీ, బోరిస్ జాన్స‌న్(Boris Johnson) ల మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. భార‌త్ ను ర‌ష్యా నుంచి దూరం చేసేందుకు ప‌శ్చి మ దేశాలు ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నాయి.

కానీ భార‌త్ మాత్రం త‌ట‌స్థ విధానాన్ని అవ‌లంభిస్తోంది. బోరిస్ జాన్స‌న్ ర‌ష్యా నుంచి స‌గానికి పైగా సైనిక హార్డ్ వేర్ ను కొనుగోలు చేసే భార‌త్ తో వాణిజ్యం, భ‌ద్ర‌తా సంబంధాల‌ను పెంపొందించ‌డంపై మోదీతో చ‌ర్చించ‌నున్నారు.

భార‌త్ తో యుకె భాగ‌స్వామ్యం ప్ర‌పంచానికి ఒక వెలుగు రేఖ‌గా అభివ‌ర్ణించారు జాన్స‌న్. వాతావ‌ర‌ణ మార్పు నుంచి ఇంధ‌న భ‌ద్ర‌త‌, రక్ష‌ణ దాకా రెండు దేశాల‌కు సంబంధంచిన స‌మ‌స్య‌ల‌పైనా ఇరు దేశాల స‌హ‌కారం ఉంటుంద‌న్నారు బోరిస్ జాన్స‌న్.

భార‌త్ తో తాము బ‌ల‌మైన బంధాన్ని కోరుకుంటున్నామ‌ని తెలిపారు జాన్స‌న్ .

Also Read : కూల్చివేస్తున్నా ప‌ట్టించుకోని సీఎం

Leave A Reply

Your Email Id will not be published!