Bosch Chairman : తెలంగాణ‌లో ‘బాష్’ భారీ విస్త‌ర‌ణ

ఐఐటీల‌తో అనుసంధానం

Bosch Chairman  : జ‌ర్మ‌నీకి చెందిన బాష్ సంస్థ భారీ విస్త‌ర‌ణగా అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా ఆటోమోటివ్ సెక్టార్ లో చోటు చేసుకున్న టెక్నాల‌జీని అందిపుచ్చుకునే ప‌నిలో ప‌డ్డ‌ది. రాబోయే ఐదు సంవ‌త్స‌రాల‌లో రూ. 1000 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది బాష్‌.

ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీగా పేరొందిన బాష్ చైర్మ‌న్ స్టెఫాన్ హ‌టుంగ్(Bosch Chairman ). తెలంగాణ‌లో ఇందుకు అనువుగా ఉండేలా ఐటీఐల‌తో అనుసంధానం చేస్తామ‌న్నారు.

అక్క‌డ నైపుణ్యాల‌ను మెరుగు ప‌రిచి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. డిజిట‌ల్ మొబిలిటీ సెక్టార్ లో ఇందుకు ఈ నిధులు అవ‌స‌రం అవుతాయ‌ని చెప్పారు.

ఇండియాలో త‌మ కంపెనీ ఏర్పాటై ఈ ఏడాదితో 100 ఏళ్లు పూర్త‌వుతాయ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ‌ర్చువ‌ల్ గా మాట్లాడారు.

జ‌ర్మ‌న్ దేశానికి చెందిన ఇంజ‌నీరింగ్ నైపుణ్యానికి భార‌త్ లోని ఎంట్ర‌ప్రెన్యూర్ షిప్ అనుసంధానం కావ‌డంతో ఇది సాధ్య‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ప‌లు రంగాల‌లో వినూత్న‌మైన‌, భిన్న‌మైన ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌గ‌లిగామ‌ని చెప్పారు.

అందు వ‌ల్లే తాము టాప్ లో ఉన్నామ‌ని తెలిపారు. 1922 లో త‌మ కంపెనీని ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా లోని 18 రాష్ట్రాల‌లో విస్త‌రించామ‌ని వెల్ల‌డించారు బాష్ చైర్మ‌న్(Bosch Chairman ).

32 వేల మందికి పైగా త‌మ కంపెనీలో ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు చైర్మ‌న్. 2025 లోపు 1000 కొత్త స‌ర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం 400 ప్రాంతాల్లో ఈ స‌ర్వీసు కేంద్రాలు ఉన్నాయ‌ని వాటిని 972 ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read : క్రిప్టో లావాదేవీల‌కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!