Rashid Khan : ఆఫ్గనిస్తాన్ ఓ వైపు అట్టుడుకుతోంది. కానీ ఆ దేశానికి చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan)కు మాత్రం హెవీ డిమాండ్ ఉంటోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ క్రికెటర్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు.
తన కుటుంబాన్ని ఏమీ చేయొద్దంటూ కోరాడు. కానీ ఏమైందో ఏమో కానీ ఆఫ్గన్ తాలిబాన్ సర్కార్ కీలక క్రికెట్ బోర్డుకు మాత్రం పూర్తి స్వేచ్ఛ కల్పించింది. ఐపీఎల్ 2021లో ఆడుతుందా లేదా అన్న అనుమానాల్ని పటాపంచలు చేసింది.
చివరకు ఆఫ్గాన్ కు పర్మిషన్ ఇచ్చింది. ఈ తరుణంలో ఈసారి ఐపీఎల్ 2022 కు సంబంధించి మెగా వేలం ప్రారంభం కానుంది.
ఇందుకు గాను మెగా వేలం నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. చైర్మన్ బ్రిజేష్ పటేల్ సారథ్యంలో కీలక సమావేశం ఇవాళ కానుంది ముంబైలో.
మెగా వేలంలో ఈసారి రెండు కొత్త జట్లు కొలువు తీరనున్నాయి. ఇప్పటికే భారీ ధర వెచ్చించి బరిలోకి రాబోతున్నాయి ఆ ఫ్రాంచైజీలు. ఒకటి అహ్మదాబాద్ కాగా రెండోది లక్నో.
ఇరు ఫ్రాంచైజీలకు మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది బీసీసీఐ. అహ్మదాబాద్ తో పాటు లక్నో ఈనెల 31 లోపు తుది జట్లను ప్రకటంచాల్సి ఉంటుంది.
అంటే ఎంపిక చేసిన జట్టుకు సంబంధించిన లిస్టును బీసీసీఐకి , ఐపీఎల్ ప్యానల్ కు ఇవ్వాలి. ఇక లక్నో స్కిప్పర్ గా కేఎల్ రాహుల్ ను తీసుకున్నట్లు టాక్.
మరో వైపు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan)ను తీసుకునేందుకు అటు లక్నో ఇటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరి వైపు ఉంటాడనేది ఇంకా తేలాల్సి ఉంది.
Also Read : ఐపీఎల్ మెగా వేలంపై కీలక నిర్ణయం