Boxer Vijender : రెజ్లర్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు
బాక్సర్ విజేందర్ సంచలన ప్రకటన
Boxer Vijender : ప్రముఖ బాక్సర్ విజేందర్ సంచలన ప్రకటన చేశారు. ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఎంత కష్టపడితే పతకాలు వస్తాయో తమను విమర్శించే వాళ్లకు తెలియదన్నారు. లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై. గత ఏప్రిల్ 23 నుండి నిరసన దీక్ష చేపట్టారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులు అకారణంగా దాడులకు దిగారు. ఆపై రెజ్లర్లపై కేసులు నమోదు చేశారు.
మరో వైపు కీలక ప్రకటన చేశారు తాము సాధించిన పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని. దీనిని వాయిదా వేసుకోవాలని కోరారు సంయుక్త కిసాన్ మోర్చా నేత నరేష్ టికాయత్. ఈ మేరకు ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు మహిళా రెజ్లర్లు. గురువారం ముజఫర్ నగర్ లో కీలక మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మరో కీలక బాక్సర్ విజేందర్(Boxer Vijender). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నేను ఇప్పటికీ మహిళా రెజ్లర్లో ఉన్నానని చెప్పారు. అవసరమైతే తాను కూడా సాధించిన పతకాన్ని వదులు కునేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. చాలా మందికి ఒలింపిక్స్ అంటే తెలియదు. కానీ సిగరెట్లు, బీడీలు, డ్రగ్స్, మద్యం గురించి బాగా తెలుసని వీరా తమ గురించి మాట్లాడేదంటూ మండిపడ్డారు బాక్సర్ విజేందర్.
Also Read : Brij Bhushan Singh