BR Ambedkar Comment : సమున్నత భారతావనికి దిక్సూచి
ఎన్న దగిన మానవుడు అంబేద్కర్
BR Ambedkar Comment : భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత, యావత్ సమున్నత భారతావనికి దిక్సూచి డాక్టర్ భీమ్ రాంజీ అంబేద్కర్. ఏప్రిల్ 14న ఆయన జయంతి. యావత్ ప్రపంచం ఆయనను స్మరించుకుంటోంది. నివాళులు అర్పిస్తోంది. తన జీవితమంతా బహుజనులు, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం నినదించిన మానవుడు.
రాజ్యంగ రూపకర్త, కీలక పాత్ర పోషించిన మహనీయుడు తత్వవేత్త అంబేద్కర్(BR Ambedkar Comment) . రాజకీయ ఉద్యమకారుడిగా, దార్శనికుడిగా గుర్తింపు పొందారు. స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. దళిత నాయకుడిగా ప్రసిద్ది చెందారు.
వృత్తి రీత్యా న్యాయవాది అయినప్పటికీ చరిత్రకారుడిగా, తవ్వ శాస్త్రవేత్తగా పేరొందాడు. అంతే కాదు రాజకీయ నాయకుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, తాత్వికుడిగా, ఆలోచనాపరుడిగా, పండితుడిగా, అర్థ శాస్త్రవేత్తగా వినుతికెక్కాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సంపాదకుడిగా కూడా పని చేశాడు.
బౌద్ద ధర్మ పునరుద్దరణ కర్తగా మారాడు. చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలు భరించాడు. అవమానాలు పడ్డాడు. పేదరికాన్ని ఎదుర్కొన్నాడు. స్వశక్తితో , స్వీయ ప్రతిభతో కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. ఏప్రిల్ 14, 1891లో మధ్య ప్రదేశ్ లోని మహోం ఊరులో పుట్టాడు.
ఆయన చివరి సంతానం. మహర్ కులానికి చెందిన వారు. మెహర్లను అంటరానిగా పరిగణించారు. వీధి కుళాయి వద్ద నీళ్లు తాగుతున్న అంబేద్కర్ ను అవమానించారు. కొట్టారు..గెంటివేశారు. తండ్రి రామ్ జీ సతారా వదిలి పిల్లల చదువు కోసం బొంబాయికి చేరుకున్నాడు. అంబేద్కర్ మెట్రిక్యూలేషన్ పాసయ్యాడు. కులం కారణంగా సంస్కృతం చదవలేక పోయాడు. ఇష్టం లేక పోయినా పర్షియన్ చదివాడు. 16 ఏళ్లు వచ్చినప్పుడే పెళ్లి చేశారు.
బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ను మరిచి పోలేం. ఆయన వల్లే అంబేద్కర్ ఉన్నత చదువులు చదివాడు. 25 రూపాయల విద్యార్థి వేతనంతో బీఏ పాసయ్యాడు. బరోడా సంస్థానంలో జాబ్ వచ్చింది. పై చదువులు చదవాలన్న కోరికతో ఉద్యోగంలో చేరలేదు.
మహారాజుకు తన కోరిక వెలిబుచ్చాడు అంబేద్కర్. చదువు పూర్తయ్యాక బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పని చేయాలని షరతు విధించాడు. దానికి ఒప్పుకున్నాడు. కొలంబియా యూనివర్శిటీలో చదువుకున్నాడు. ఎంఏ, పీహెచ్ డీ పొందాడు. 1917లో ఇండియాకు వచ్చాడు .ఆయనకు 27 ఏళ్లు. ఒక అంటరాని వాడు ఇంత గొప్పగా చదువు కోవడం ఏంటి అంటూ అగ్రవర్ణాల వారు ఆడిపోసుకున్నారు.
మహారాజా వద్ద మిలిటరీ కార్యదర్శి అయ్యాడు అంబేద్కర్. నౌకర్లు ఇబ్బందులు పెట్టేవారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అంటరానితనం నిర్మూలనకు కృషి చేశాడు. ఆయన సాయంతో మూక నాయక్ అనే పక్షపత్రిక నడిపాడు అంబేద్కర్.
ఇదే సమయంలో 1927లో మహాద్ లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ నుండి వేలాది మంది వచ్చారు. మహాద్ చెరువులో నీళ్లు తాగేందుకు వీలు లేదన్నారు. కానీ అంబేద్కర్ దానిని అడ్డుకున్నారు. అంతా కలిసి చెరువులో నీళ్లు తాగడం కలకలం రేపింది. బహిష్కృత భారతి అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. తిలక్ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండేవాడు కాదని రాశాడు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 25న మను స్మృతిని బహిరంగా కాల్చాడు అంబేద్కర్(BR Ambedkar Comment) .
అంటరానితనం విషయంలో గాంధీతో విభేదించాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అంటరాని కులాలకు రాజ్యాధికారం రాకుండా , ఆర్థికంగా బలపడకుండా వారి సమస్యలకు పరిష్కారం లభించదని స్పష్టం చేశాడు. గాంధీ అనుసరిస్తున్న విధానం తప్పు అని ప్రకటించాడు.
ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుపట్టాడు అంబేద్కర్(BR Ambedkar Comment) . గాంధీ అందుకు ఒప్పుకోలేదు. 1932లో దళితులకు నియోజకవర్గాలు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో గాంధీ నిరసన వ్యక్తం చేస్తూ నిరాహారదీక్ష చేపట్టారు.
చివరకు గాంధీ, అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం కుదిరింది. దీని తర్వాత హరిజన్ సేవక్ సమాజ్ స్థాపించాడు గాంధీ. ఇందులో అంబేద్కర్ ను భాగస్వామిగా చేశాడు. తాను ఇముడలేక పోయాడు. ప్రత్యేకంగా దళిత సమస్య పరిష్కారానికి రెండు పార్టీలను ఏర్పాటు చేశాడు అంబేద్కర్. రాజ్యసభ పరిషత్తు సభ్యుడిగా, న్యాయ శాఖ మంత్రిగా ఎనలేని కృషి చేశారు.
ఏడుగురిని నియమిస్తే బాబా సాహెబ్ ఒక్కడే భారత రాజ్యాంగాన్ని మోయాల్సి వచ్చిందని పేర్కొన్నారు ఒకప్పటి న్యాయ శాఖ మంత్రి టీటీ కృష్ణమాచారి. ఇక మొదటి భార్య మరణించడంతో 56వ ఏట శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నాడు అంబేద్కర్. బౌద్ద మతం స్వీకరించాడు.
హిందువుగా మరణించ దల్చుకోలేనంటూ సంచలన ప్రకటన చేశాడు. ప్రపంచంలోనే పేరొందిన రచయిత బెవర్లి నికోలస్ అంబేద్కర్ ను ఎన్నదగిన మానవుడిగా కీర్తించాడు. డిసెంబర్ 6, 1956లో కన్నుమూశారు మహోన్నత మానవుడు భీమ్ రావ్ అంబేద్కర్(BR Ambedkar Comment) .
Also Read : నీ మరణం వృధా కాదు