Brian Lara : సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ గా లారా
ప్రకటించిన ఎస్ఆర్ హెచ్ మేనేజ్ మెంట్
Brian Lara : సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా పేరొందిన విండీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ బ్రియాన్ లారాను(Brian Lara) తమ జట్టుకు హెడ్ కోచ్ గా నియమించినట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఎస్ఆర్హెచ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో అధికారికంగా ధ్రువీకరించింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో రాబోయే సీజన్ లకు తమ కొత్త ప్రధాన కోచ్ గా లారాను నియమించినట్లు తెలిపింది.
కాగా టోర్నమెంట్ చివరి ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) కు ప్రధాన కోచ్ గా ఉన్న టామ్ మూడీతో ఉన్న ఒప్పందాన్ని విరమించుకుంది.
విచిత్రం ఏమిటంటే ఈసారి జరిగిన ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో ఎస్ ఆర్ హెచ్ ఆర్ హెచ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. కోచ్ లను మార్చినా కెప్టెన్లను మార్చినా ఎందుకనో ఆ జట్టుకు లక్ కలిసి రావడం లేదు.
గతంలో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్(IPL) లో అనూహ్యంగా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్(David Warner) ను పక్కన పెట్టింది. ఇదే క్రమంలో ఈసారి జరిగిన వేలం పాటలో ఊహించని రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని చేజిక్కించుకుంది.
తన దైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు వార్నర్. తాను ప్రాతినిధ్యం వహించిన జట్టుకు చుక్కలు చూపించాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో మీడియా మొఘల్ గా పేరొందిన సన్ ఇంటర్నేషనల్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను చేజిక్కించుకుంది.
కానీ సీన్ మాత్రం మారడం లేదు జట్టుకు సంబంధించి. ఇక బ్రియన్ లారా వచ్చాక టీమ్ ను ఏ మేరకు గట్టెక్కిస్తాడనేది వేచి చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే లారాకు హెడ్ కోచ్ పదవి అగ్ని పరీక్షేనని చెప్పక తప్పదు.
Also Read : ఆసియా కప్ సూపర్- 4 షెడ్యూల్