Brian Lara Bumrah : బుమ్రాకు బ్రియాన్ లారా అభినందన
తన రికార్డును బద్దలు కొట్టిన జస్ప్రీత్
Brian Lara Bumrah : ఇంగ్లండ్ తో జరుగుతున్న రీ షెడ్యూల్ ఐదో టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన రికార్డు సాధించాడు. కేవలం ఒకే ఓవర్ లో ఏకంగా 29 పరుగులు చేశాడు.
ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లతో పాటు ఓ సింగిల్ రన్ చేశాడు స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా. రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కు కరోనా సోకడంతో అతడిని పక్కన పెట్టింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.
ఇదే సమయంలో వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గాయపడడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ కు చాన్స్ ఇచ్చారు. మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ తో పాటు రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించారు.
ఆఖరున వచ్చిన బుమ్రా దంచి కొట్టాడు. ఇదిలా ఉండగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా పేరుతో రికార్డు నమోదైంది.
2003-04 సీరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో లారా 28 పరుగులు చేశాడు. తాజాగా జస్ ప్రీత్ బుమ్రా బ్రయాన్ లారాను అధిగమించాడు.
ఇదిలా ఉండగా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు 19 సంవత్సరాల సమయం పట్టింది. కేవలం 16 బంతులు మాత్రమే ఆడిన జస్ ప్రీత్ బుమ్రా 35 పరుగులు చేసి సత్తా చాటాడు.
ఆ తర్వాత ప్రత్యర్థి జట్టును తన బౌలింగ్ తో కట్టడి చేశాడు. ఈ సందర్భంగా తన రికార్డ్ ను బ్రేక్ చేసిన బుమ్రాను(Brian Lara Bumrah) ప్రత్యేకంగా అభినందించాడు.
Also Read : లారా రికార్డ్ బద్దలు కొట్టిన బుమ్రా