Wrestlers Protest : సింగ్ ను సాగ‌నంపేంత దాకా స‌మ‌ర‌మే

కామాంధుడిని తొల‌గించాల్సిందే

Wrestlers Protest : భార‌త రెజ్లింగ్ సమాఖ్య (డ‌బ్ల్యూఎఫ్ఐ) జాతీయ అధ్య‌క్షుడు, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను తొల‌గించేంత వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు మ‌హిళా రెజ్ల‌ర్లు. గ‌త కొన్నేళ్లుగా త‌మ‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దేశ వ్యాప్తంగా రెజ్ల‌ర్లు చేస్తున్న ఆందోళ‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వినేష్ ఫోగ‌ట్ నేతృత్వంలో 30 మందికి పైగా మ‌హిళా రెజ్ల‌ర్లు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి ప‌లువురు మ‌ద్ద‌తు తెలిపారు. రాజ‌కీయ పార్టీల‌ను రెజ్ల‌ర్లు ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు.

సీపీఎం నాయ‌కురాలు బృందా కార‌త్ కు చేదు అనుభ‌వం మిగిలింది. ఇది పార్టీల‌కు సంబంధించిన అంశం కాద‌ని, ఇది కేవ‌లం ఆట‌కు సంబంధించిన స‌మ‌స్య అని తాము తేల్చుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ ను తొల‌గించేంత వ‌ర‌కు తాము దీక్ష విర‌మించ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు(Wrestlers Protest).

దీంతో కేంద్రం దిగి వ‌చ్చింది. ఈ మేర‌కు బజ్ రంగ్ పూనియా, వినేశ్ ఫోగ‌ట్ , అన్షు , సాక్షి మాలిక్ , ఆమె భ‌ర్త స‌త్య‌వ్ర‌త్ క‌డియాన్ తో స‌హా మ‌రికొంద‌రు రెజ‌ర్ల‌తో క్రీడా కార్య‌ద‌ర్శి సుజాత చ‌తుర్వేది, సాయ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సందీప్ ప్ర‌ధాన్ , జాయింట్ సెక్ర‌ట‌రీ కునాల్ తో గంట‌కు పైగా చ‌ర్చ‌లు జ‌రిపారు.

తాము ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. సింగ్ వేధించడంలో కింగ్ అని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే ఇంకా చ‌ర్చ‌లు ఏమిటి అంటూ ప్ర‌శ్నించింది వినేశ్ ఫోగ‌ట్.

Also Read : మ‌హిళా రెజ్ల‌ర్ల మీటూ ఉద్య‌మం

Leave A Reply

Your Email Id will not be published!