Brij Bhushan Singh : ఆరోపణలు రుజువైతే ఉరేసుకుంటా
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
Brij Bhushan Singh : భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Singh) సంచలన కామెంట్స్ చేశారు. తనపై మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఒకవేళ అవి రుజువైతే ఎవరో ఉరి వేయాల్సిన అవసరం లేదని తానే ఉరి వేసుకుంటానని ప్రకటించారు. బుధవారం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా ఆయనకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ఆందోళనను ఉధృతం చేశారు. ఆపై సంచలన ప్రకటన చేశారు. హరిద్వార్ లోని గంగలో తాము సాధించిన పతకాలను వేస్తామని ప్రకటించారు. దీనిని విరమించు కోవాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా నేత నరేష్ టికాయత్ కోరారు. రైతు అగ్ర నేతలు చేసిన విన్నపం మేరకు మహిళా రెజ్లర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేశారు. కేంద్ర సర్కార్ కు ఐదు రోజుల డెడ్ లైన్ విధించారు.
ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. నాపై ఒక్క ఆరోపణ రుజువైతే తాను ఉరి వేసుకుంటానని స్పష్టం చేశారు. మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని మహిళా రెజ్లర్లను ఉద్దేశించి సవాల్ విసిరారు. ఎలాంటి శిక్షకైనా తాను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు ఎంపీ బ్రిజజ్ భూషణ్ శరణ్ సింగ్.
.మరో వైపు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆయనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. 15 రోజుల్లోగా పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పిస్తారని సమాచారం.
Also Read : Kejriwal MK Stalin