Brij Bhushan Singh : నాలో అంత లైంగిక సామర్థ్యం ఉందా
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్
Brij Bhushan Singh : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలంల రేపింది. ఆయనను చీఫ్ పదవి నుంచి తొలగించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. వారికి పార్టీలు, సంస్థలు, వివిధ సంఘాలు బేషరతుగా మద్దతు తెలిపాయి.
ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఎందుకు దానిని బయట పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. మహిళా రెజ్లర్లను అవమానించేలా కామెంట్స్ చేశారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Singh). ఆయన మీడియాతో మాట్లాడారు. కపిల్ సిబల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన కేసు వాదించాలంటే కనీసం రూ. 25 లక్షలు తీసుకుంటారని మహిళా రెజ్లర్లకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ఇదే సమయంలో మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రెజ్లర్లు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. తాను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నానని పేర్కొన్నారని, ఇంతకూ అంతటి లైంగిక సామర్థ్యం తన వద్ద ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. తానేమీ లైంగిక పటుత్వం కోసం లేహ్యాలు ఏమీ తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Singh) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : రెజ్లర్ల కన్నీళ్లకు విలువే లేదా