Bro The Warrior Movie : 28న రానున్న పవన్ ..తేజ్ ‘బ్రో’
కేవలం 10 రోజులేనన్న వరుణ్
Bro The Warrior Movie : తెలుగు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ కు ఉన్న రేంజ్ వేరు. ఆయన స్టార్ డమ్ మిగతా హీరోల కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చేస్తున్నాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో ది అవతార్ మూవీ(Bro The Warrior Movie) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , సాంగ్ కు భారీ ఆదరణ లభించింది.
Bro The Avatar in 10 Days
ట్విట్టర్ వేదికగా సాయి ధరమ్ తేజ్ కీలక ప్రకటన చేశారు. జస్ట్ వెయిట్ మీరంతా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రం పది రోజుల్లో రానందుంటూ వెల్లడించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తే ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రానికి కథ అందించాడు. 2021లో తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది వినోదయ సీతం చిత్రం. ఈ చిత్రం ఆధారంగా పవన్ కళ్యాణ్ , తేజ్ తో మూవీ తీశాడు సముద్ర ఖని. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.
చిత్రంలో పవన్ , తేజ్ తో పాటు బ్రహ్మానందం, ప్రియా ప్రకాష్ వారియర్ , కేతిక శర్మ , సుబ్బరాజు నటించారు. సుజిత్ వాసుదేవ్ సినిమోటోగ్రఫీ అందించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ దీనిని విడుదల చేయనున్నాయి. సో జూలై 28న బ్రో ది వారియర్ సినిమా రిలీజ్ కానుంది.
Also Read : PM Modi Tribute : ఊమెన్ చాందీని కోల్పోవడం బాధాకరం
