BRS Swetha Patram : సర్కార్ పై గులాబీ స్వేద పత్రం
విడుదల చేసిన బీఆర్ఎస్
BRS Swetha Patram : హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏలిన బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యింది బీఆర్ఎస్ . ఈ మేరకు కాంగ్రెస్ శ్వేత పత్రానికి వ్యతిరేకంగా శనివారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో స్వేద పత్రం విడుదల చేసింది.
BRS Swetha Patram Viral
తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వాస్తవాలు వక్రీకరించిందంటూ ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానం వివరించేందుకు స్వేద పత్రం రిలీజ్ చేసినట్లు తెలిపారు.
వాస్తవాలను తెలియ పర్చేందుకు తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలని శాసన సభలో మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ ఇచ్చారు. దీనిపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
శ్వేత పత్రాల పేరుతో సర్కార్ వాస్తవాలను వక్రీకరించి తమపై బురద చల్లేందుకు ప్రయత్నం చేసిందని ఆరోపించారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : Nara Lokesh : జగన్ ను నమ్మితే నాశనమే