BS Yediyurappa : యెడ్డీకి జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ

ప్ర‌క‌టించిన కేంద్ర హోం శాఖ

BS Yediyurappa : క‌ర్ణాట‌క – కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ బుధ‌వారం క‌ర్ణాట‌క మాజీ సీఎం బీఎస్ యెడ్యూర‌ప్ప‌కు భ‌ద్ర‌త పెంచుతున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మాజీ సీఎంకు భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా , తీవ్రాదుల నుంచి ముప్పు పొంచి ఉంద‌న్న నిఘా వ‌ర్గాలు నివేదించాయ‌ని , దీంతో యెడ్డీకి జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

BS Yediyurappa Got Z+ Category Secutiry

అయితే ఈ జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ కేవ‌లం క‌ర్ణాట‌క రాష్ట్రం వ‌ర‌కే అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది కేంద్ర హోం శాఖ‌. ప్ర‌స్తుతం బీజేపీకి కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ఆ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కూడా యెడ్డీదే కావ‌డం విశేషం.

సీఆర్పీఎఫ్ కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. త‌న‌ను సీఎంగా తొల‌గించి బ‌స్వ‌రాజ్ బొమ్మైకి పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. కానీ ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చేతిలో ఓట‌మి పాలైంది.

దీంతో యెడ్డీని(BS Yediyurappa) తొల‌గించ‌డ వ‌ల్ల‌నే పార్టీకి తీర‌ని న‌ష్టం వాటిల్లింద‌ని బీజేపీ భావించింది. స్టార్ క్యాంపెయిన‌ర్ లిస్టులో మాజీ సీఎంను చేర్చింది. త‌న సారథ్యంలో త్వ‌ర‌లో జ‌రిగే సార్వ‌త్రిక లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి పూర్వ వైభ‌వం తీసుకు రావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు మాజీ సీఎం. క‌ర్ణాట‌క రాష్ట్ర‌మంత‌టా ప‌ర్య‌టించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు యెడ్డీ.

Also Read : EX MLC Santhosh Kumar : హ‌స్తం వైపు మాజీ ఎమ్మెల్సీ చూపు

Leave A Reply

Your Email Id will not be published!