Bulldozer Baba : బుల్‌డోజర్ బాబానా మ‌జాకా

అక్ర‌మార్కులపై ఉక్కుపాదం

Bulldozer Baba : ఎవ‌రీ బుల్ డోజ‌ర్ బాబా అని అనుకుంటున్నారా. ఇంకెవ‌రు వ‌న్ అండ్ ఓన్లీ మెన్ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. ఇప్పుడు యోగి పేరు ఎవ‌రూ జపించ‌డం లేదు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా బుల్ డోజ‌ర్ బాబా (Bulldozer Baba)పేరే వినిపిస్తోంది. ఇలా పిలిచేందుకు ఒకే ఒక కార‌ణం ఉంది.

అదేమిటంటే రాష్ట్రంలో ఎవ‌రు అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డినా నేరాల‌కు ఉసి గొల్పినా వెంట‌నే బుల్ డోజ‌ర్లు వాలి పోతాయి.

ఇప్పుడు నేరం చేయాలంటే జ‌డుసు కోవాల్సిందే. నేర‌స్థులు త‌మ మెడ‌ల్లో మ‌మ్మ‌ల్ని చంపొద్దంటూ ప్ల కార్డులు ప‌ట్టుకుని ఉన్నారు.

ఇంకొంద‌రైతే పోలీస్ స్టేష‌న్ ల‌కు వెళ్లి స్వ‌చ్చందంగా లొంగి పోతున్నారు.

ఇలా త‌యారు కావ‌డానికి కార‌ణం ఒకే ఒక్క‌డు ద‌మ్మున్నోడు యోగి ఆదిత్యానాథ్.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నీ తానై భార‌తీయ జ‌న‌తా పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చాడు.

ఈ ఘ‌న‌త కేవ‌లం యోగికే ద‌క్కుతుంది. నేరాల‌కు అడ్డాగా మారిన యూపీలో ఇప్పుడు నేరాల‌కు పాల్ప‌డే వారు జంకేలా చేశాడు.

గ్యాంగ్ స్ట‌ర్ల పేరుతో జులుం చేసే వారిని ఎన్ కౌంట‌ర్ చేయ‌మ‌ని ఆదేశించాడు.

ఎవ‌రినీ లెక్క చేయ‌వ‌ద్దంటూ స్ప‌ష్టం చేశాడు. దీంతో నేర‌స్థులు త‌మ పేర్లు చెప్పేందుకు భ‌య‌ప‌డుతున్నారు.

ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన స‌మాజ్ వాది పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పెట్రోల్ బంకును బుల్ డోజ‌ర్ కూల్చేసింది.

నోటీసు ఇచ్చినా స్పందించ లేదు. యూపీలో యోగి ఏం చెబితే అదే వేదం. అదే చ‌ట్టం. అదే శాస‌నం. ముస్లింలు సీఎంను చూసి వ‌ణుకుతున్నారు.

అవినీతి, అక్ర‌మాల‌కు, ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డితే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు. తాజాగా ఎవ‌రైనా స‌రే మంత్రులైనా, ఉన్నాధికారులైనా గెస్ట్ హౌస్ ల్లోనే ఉండాల‌ని ఆదేశించాడు.

పార‌ద‌ర్శ‌క పాల‌న‌కు తెర తీసిన యోగి ఆదిత్యానాథ్ ఇప్పుడు ఇండియాకు ఐకాన్ గా మారాడు. అందుకే బుల్ డోజ‌ర్ బాబా(Bulldozer Baba)గా పేరొందాడు.

ఓ టీస్టాల్ య‌జ‌మాని త‌న దుకాణానికి బుల్ డోజ‌ర్ బాబా అని పేరు పెట్టుకున్నాడు. మేం త‌యారు చేసే టీ క‌డ‌క్ గా ఉంది. త‌క్ష‌ణ‌మే కిక్ ఇస్తుందంటాడు.

ఇందులో టీతో పాటు ల‌స్సీ కూడా విక్ర‌యిస్తారు. దీని గౌశాల ల‌స్సీ భండార్ అని కూడా మ‌రో పేరు పెట్టారు. యోగి ఆదిత్యానాథ్ కు చాలా ఆవులున్నాయి. ఇదే ఆయ‌న‌కు మేం ఇచ్చే గౌర‌వం అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు బుల్ డోజ‌ర్ బాబా ఓ సెన్సేష‌న్.

Also Read : ర‌గులుతున్న ర‌ష్యా త‌గ్గ‌నంటున్న ఉక్రెయిన్

Leave A Reply

Your Email Id will not be published!