Shane Watson : బుమ్రాకు ప్ర‌త్యామ్నాయ బౌల‌ర్ లేడు

ప్ర‌శంస‌లు కురిపించిన షేన్ వాట్సన్

Shane Watson : ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు షేన్ వాట్సాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భార‌త జ‌ట్టు పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అద్బుత‌మైన బౌల‌ర్ అని కితాబు ఇచ్చాడు. అత‌డిని భ‌ర్తీ చేసే బౌల‌ర్ వ‌ర‌ల్డ్ లో లేనే లేడ‌ని కితాబు ఇచ్చాడు వాట్సన్. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 16న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2022 ప్రారంభం కానుంది.

ఇందులో భాగంగా ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు కూడా హాట్ ఫెవ‌రేట్ గా ఉంది. ఈ త‌రుణంలో వాట్సాన్(Shane Watson) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. వెన్ను నొప్పి కార‌ణంగా జ‌స్ప్రీత్ బుమ్రా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. దీంతో బుమ్రా లేని భార‌త జ‌ట్టును ఊహించ లేమ‌న్నాడు షేన్ వాట్స‌న్.

ఒక ర‌కంగా టీమిండియాకు ఇబ్బందిక‌ర‌మ‌ని పేర్కొన్నాడు. బుమ్రా లేకుండా జ‌ట్టు ఇత‌ర జ‌ట్ల‌పై గెల‌వ‌డం క‌ష్ట‌మ‌న్నాడు వాట్స‌న్. ఈ స్టార్ పేస‌ర్ కి ప్ర‌పంచంలోనే కాదు దేశంలో కాకుండా ఎవ‌రూ ప్ర‌త్యామ్నాయం కాలేర‌ని కితాబు ఇచ్చాడు ఆసిస్ మాజీ ఆట‌గాడు. ఇదిలా ఉండ‌గా వాట్స‌న్ ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ ఆల్ రౌండ‌ర్ గా పేరొందాడు.

207 ఆట‌ల‌లో 291 వికెట్లు తీశాడు. 41 ఏళ్ల వాట్స‌న్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడేందుకు ఇండియాకు వ‌చ్చాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం సంద‌ర్భంగా బుమ్రా భార‌త జ‌ట్టులో లేక పోవ‌డం ఒక ర‌కంగా ఇబ్బంది క‌ర‌మేన‌ని పేర్కొన్నాడు షేన్ వాట్స‌న్. ఇదిలా ఉండ‌గా బుమ్రా లేక పోవ‌డంపై భార‌త జ‌ట్టు కూడా ఆందోళ‌న చెందుతోంది.

Also Read : స‌త్తా చాటిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!