Sangakkara : ఐపీఎల్ చరిత్రలో బట్లర్ అద్భుతం – సంగక్కర
స్టార్ హిట్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే
Sangakkara : రాజస్తాన్ రాయల్స్ స్టార్ హిట్టర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ దుమ్ము రేపాడు. ఐపీఎల్ 2022లో 4 సెంచరీలు , హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగుల వ్యక్తిగత జాబితాలో టాప్ లో నిలిచాడు.
క్వాలిఫయిర్ -2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు చుక్కలు చూపించింది రాజస్తాన్ రాయల్స్ . 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్ లో అద్భుతంగా రాణించింది.
60 బంతుల్లో 106 పరుగులు చేసి మారథన్ ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లను దంచి కొట్టి, చుక్కలు చూపించిన స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ ను ఆకాశానికి ఎత్తేశాడు రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర(Sangakkara).
అతడి ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. బెంగళూరుపై విజయం సాధించిన అనంతరం మీడియాతో సంగక్కర మాట్లాడాడు. టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ కు ఓ పిల్లర్ గా మారాడని కితాబు ఇచ్చాడు.
16 మ్యాచ్ లు ఆడి 824 పరుగులు చేశాడని, ఈ విజయంలో ప్రతి ఒక్కరు బాగా ఆడారని చెప్పాడు. ఈ సీజన్ లో బట్లర్ జట్టు గెలుపు కోసం తన సర్వశక్తులు పెట్టి ఆడాడని పేర్కొన్నాడు.
విధ్వంసకరమైన బ్యాటర్ గురించి మాటల్లో చెప్పలేనని ప్రశంసించాడు కుమార సంగక్కర(Sangakkara). ఐపీఎల్ చరిత్రలో ఓ అద్భుతంగా బట్లర్ ఆట తీరును అభివర్ణించాడు మాజీ క్రికెట్ దిగ్గజం.
టోర్నీలో స్టార్టింగ్ లో దుమ్ము రేపాడు. ఆ తర్వాత ఇబ్బంది పడ్డాడు. మళ్లీ దుమ్ము రేపాడని తెలిపాడు. ఆటను ఇంత బాగా అర్థం చేసుకున్న ఆటగాడిని తాను ఇంత వరకు చూడలేదన్నాడు సంగక్కర.
Also Read : మిస్టర్ కూల్ కెప్టెన్సీ అదుర్స్