Cameron Surya Kumar Yadav : చెలరేగిన సూర్య..కామెరాన్
రాణించినా ముంబైకి తప్పని ఓటమి
Cameron Surya Kumar Yadav : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగింది. కానీ అర్ష్ దీప్ సింగ్ దెబ్బకు ముంబై ఇండియన్స్ తల వంచింది.
మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది పంజాబ్ కింగ్స్ . నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ కేవలం 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ చేతిలో 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఐపీఎల్ లో వరుసగా విఫలమవుతూ వస్తున్న సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఈసారి మ్యాచ్ లో సత్తా చాటాడు. కామెరాన్(Cameron) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కామెరాన్ 67 రన్స్ తో సత్తా చాటితే సూర్య కుమార్ యాదవ్ 57 పరుగులతో కీలక పాత్ర పోషించాడు.
వీరిద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జట్టును విజయపు అంచుల్లోకి తీసుకు వెళ్లారు. కానీ ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ . ఆఖరి ఓవర్ లో 16 రన్స్ కావాల్సి ఉండగా 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు.
Also Read : సింగ్ దెబ్బకు విరిగిన వికెట్లు