Camille Vasquez : కామిల్లె వాస్క్వేజ్ సెన్సేషన్ నెట్టింట్లో వైరల్
బిగ్ సెలబ్రిటీగా మారిన జానీ డెప్ లాయర్
Camille Vasquez : హాలీవుడ్ దిగ్గజ నటీనటుల పరువు నష్టం దావా కేసు యావత్ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఆ ఇద్దరు ఎవరో కాదు జానీ డెప్ , మాజీ భార్య అంబర్ హియర్డ్ . తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, మానసికంగా చిత్ర హింసలు పెట్టాడంటూ వాపోయింది.
అంతే కాదు జానీ డెప్ చేస్తున్న వ్యవహారం, ప్రవర్తిస్తున్న తీరుపై 2018లో ఓ కథనం కూడా రాసింది అంబర్ హియర్డ్. అమెరికా లోని వర్జీనియా కోర్టులో జానీ డెప్ , అంబర్ హియర్డ్ పరువు నష్టం కేసు విచారణకు వచ్చింది.
ఇరువురి వాదనలు విన్నది ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ. చివరకు పూర్వపరాలు , ఆధారాలను పరిశీలించిన జ్యూరీ సంచలన తీర్పు చెప్పింది. జానీ డెప్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.
మాజీ భార్య అంబర్ హియర్డ్ కు షాక్ ఇచ్చింది. $15 మిలియన్ డాలర్లు జానీ డెప్ కు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో అంబర్
హియర్డ్ కన్నీటి పర్యంతం అయ్యారు.
తాను అంతగా ఇచ్చుకోలేనంటూ వాపోయింది. ఇదిలా ఉండగా జానీ డెప్ కేసు వరల్డ్ వైడ్ గా ఆసక్తిని రేపింది. అంతకంటే ఎక్కువగా జానీ డెప్
విజయం సాధించేలా కేసును వాదించిన ఆ లాయర్ ఎవరు అంటూ వెతకడం ప్రారంభించింది.
యావత్ ప్రపంచం ఎవరీ కామిల్లె వాస్క్వేజ్(Camille Vasquez) అని గూగుల్, బింగ్ సామాజిక మాధ్యమాలను వెదికారు. దీంతో ఒక్కసారిగా ఈ
లాయరమ్మ పాపులర్ అయి పోయారు. అంతే కాదు వరల్డ్ వైడ్ గా బిగ్ సెలబ్రిటీగా మారి పోయారు.
ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. నిజం నిలిచింది న్యాయం గెలిచిందంటూ ఆమె తీర్పు తర్వాత జ్యూరీకి ధన్యవాదాలు తెలిపింది.
ఆమెకు అభిమానులు పెరిగి పోయారు. మొత్తంగా ఈ లాయర్ ఇప్పుడు ఓ సెన్సేషన్.
Also Read : సివిల్స్ టాపర్ సింగ్లా డ్యాన్స్ వైరల్