Johnny Depp Lawyer : జానీ డెప్ తో డేటింగ్ అబద్దం – కామిల్లె
పుకార్లేనంటూ ఖండించిన లాయర్
Johnny Depp Lawyer : ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ పరువు నష్టం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన మాజీ భార్య
అంబర్ హియర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చింది వర్జీనియా జ్యూరీ.
ఈ మేరకు జానీ డెప్ కు $ 15 మిలియన్ల డాలర్లు నష్ట పరిహారం కింద ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి జానీ డెప్ కు ఎంత
పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువగా ఆయన తరపున వాదించిన డైనమిక్, యంగ్ లాయర్ కామిల్లె వాస్క్వేజ్ కు వచ్చింది.
కోర్టులో, బయట లాయర్, నటుడు జానీ డెప్ తో కొంచెం చనువుగా ఉండడం చూశారు. దీంతో జానీ, కామిల్లె(Johnny Depp Lawyer) ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఇదే సమయంలో లాయర్ కు ప్రమోషన్ కూడా దక్కింది. బ్రౌన్ రుడ్నిక్ న్యాయ సంస్థలో భాగస్వామిగా మారారు. తాను , నటుడు జానీ డెప్(Johnny Depp Lawyer) తో డేటింగ్ లో వస్తున్న ప్రచారం అబద్దమని ఖండించారు.
ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నదే తప్పా వాస్తవం కాదన్నారు కామిల్లె . సోషల్ మీడియాలో వైరల్ గా మారారు ఈ ఇద్దరూ. ఎక్కడ చూసినా ఈ
ఇద్దరి ఫోటోలు దర్శనం ఇచ్చాయి.
ఈ సందర్భంగా ఆమె పీపుల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.
జానీ డెప్ నాకు నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు.
అంత మాత్రాన డేటింగ్ చేస్తానని ఎలా అనుకున్నారంటూ ప్రశ్నించింది కామెల్లె. వినడానికే అసహ్యంగా ఉందన్నారు ఆమె. నేను క్యూబన్,
కొలంబియన్ కు చెందిన దానిని. నా పరిమితులు ఏంటో నాకు బాగా తెలుసన్నారు.
తనకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని తెలిపారు. ఒక న్యాయవాది తమ క్లయింట్ తో డేటింగ్ చేయడం అనైతికమని స్పష్టం చేసింది కామిల్లె.
Also Read : ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య