Camp Bell Wilson : ఎయిర్ ఇండియా బాస్ గా క్యాంప్ బెల్ విల్సన్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్..మేనేజింగ్ డైరెక్టర్
Camp Bell Wilson : భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకుంది. ఈ తరుణంలో సదరు సంస్థను లాభాల బాటలో తీసుకు వెళ్లేందుకు టర్కీకి చెందిన వ్యక్తిని గతంలో ఎండీగా డిక్లేర్ చేసింది.
అయితే ఆయనపై బీజీపే శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గింది. ఈ తరుణంలో ఎయిర్ ఇండియాకు నూతన సీఇఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాంప్ బెల్ విల్సన్(Camp Bell Wilson) ను నియమించింది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది టాటా గ్రూప్ . ఇక విల్సన్ విషయానికి వస్తే విమానయాన రంగంలో అపారమైన అనుభవం ఉంది. సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూపులో కీలక బాధ్యతలు చేపట్టారు.
ఆ సంస్థను లాభాల బాటలో పయనించేలా చేశారు. ఈ రంగంలో ప్రత్యేకంగా క్యాంప్ బెల్ విల్సన్ కు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. సింగపూర్ కాకుండా జపాన్, కెనడా, హాంగ్ కాంగ్ దేశాలలో కూడా విధులు సమర్థవంతంగా చేపట్టారు విల్సన్.
టాటా గ్రూప్ విస్తారాలో భాగస్వామ్యం ఉంది. స్కూట్ లో కూడా పని చేశారు విల్సన్(Camp Bell Wilson). ఇదిలా ఉండగా క్యాంప్ బెల్ విల్సన్ క్యాట్ బరీ వర్సిటీ నుంచి ఎంబీఏలో పట్టా పొందారు.
ఈ సందర్భంగా సిఇఓగా, ఎండీగా ఆయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.
అపారమైన అనుభవం, వృత్తి పట్ల అంకిత భావం కలిగిన క్యాంప్ బెల్ విల్సన్ సారథ్యంలో ఎయిర్ ఇండియా మరింత ముందుకు వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : వసతుల కల్పనలో తెలంగాణ టాప్