Rahul Gandhi : అమ్మ కోసం విచారణకు రాలేను – రాహుల్
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వినతి
Rahul Gandhi : నేషనల్ హెరాల్డ్ పత్రికా కేసులో విచారణకు గత మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ హాజరయ్యారు. మొదటి రోజు 10 గంటలకు పైగా విచారిస్తే, రెండో రోజు 11 గంటలకు పైగా రాహుల్(Rahul Gandhi) ను విచారించింది.
ఇవాళ మరికొన్ని గంటల పాటు విచారణ చేపట్టంది. ఈ తరుణంలో నాలుగో రోజు శుక్రవారం కూడా హాజరు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది.
దీనిపై రాహుల్ గాంధీ గురువారం క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 17న ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ ఓ లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీకి కరోనా సోకింది.
ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. తాను ఆమె పక్కన ఉండాలని , ఇందు కోసం తాను ఈడీ ముందుకు రాలేనని పేర్కొన్నారు. విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్ గాంధీ.
కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ పాత్ర పై ఇప్పటి వరకు ఈడీ స్పష్టత ఇవ్వలేక పోయింది. మూడు రోజుల పాటు 26 గంటలకు పైగా ప్రశ్నించింది రాహుల్ గాంధీని(Rahul Gandhi).
గురువారం ఆయన విచారణకు బ్రేక్ పడింది. కాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు చేసిన వినతిపై ఇంకా స్పందించ లేదు ఈడీ. ఇదిలా ఉండగా సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
ఆమె కరోనా కారణంగా హాజరు కాలేక పోయింది విచారణకు. తనకు పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, కావున విచారణకు రాలేనని తెలిపింది ఈడీకి. ఆరోగ్యం కుదట పడ్డాక వస్తానని స్పష్టం చేసింది.
Also Read : కాంగ్రెస్ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం