Rasna Journey : ‘ఐ ల‌వ్ యూ ర‌స్నా’ను మ‌రిచి పోలేం

భార‌తీయ మార్కెట్ లో చెర‌గ‌ని ముద్ర‌

Rasna Journey : పానియాలు (డ్రింక్స్ ) అనే స‌రిక‌ల్లా ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది అప్ప‌ట్లో ర‌స్నానే. ఎవ‌రి అభిరుచులు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బ్రాండ్ లు పెప్సీ , కోకో కోలా, మిరిండా, మ‌జా ఇలా డామినేట్ చేస్తున్న త‌రుణంలో మెల్లాగా ఎంట్రీ ఇచ్చింది ర‌స్నా.

గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ కు చెందిన ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్యాపారి ఖంబ‌ట్టా సాధించిన స‌క్సెస్. ర‌స్నా పానియంతో ఏకంగా 60 దేశాల‌కు విస్త‌రించింది ర‌స్నా కంపెనీ. అదో బ్రాండ్ గా మారి పోయింది.

చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా ప్ర‌తి ఒక్క‌రు ర‌స్నాను(Rasna Journey) ఆస్వాదించారు. న‌వంబ‌ర్ 19న ర‌స్నా వ్య‌వ‌స్థ‌ప‌కుడు చ‌ని పోయాడు. అందుకే మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోంది. 

టెక్నాల‌జీ అంత‌గా అభివృద్ది చెంద‌ని కాలంలో ర‌స్నా ఒక ఊపు ఊపింది. దూరద‌ర్శ‌న్ ప్ర‌సారం అవుతున్న స‌మ‌యంలో ప్ర‌క‌ట‌న‌లు ప‌రిమితంగా ఉండేవి. టెలికాస్ట్ అయ్యే యాడ్స్ పెద్ద‌ల‌కు సంబంధించిన‌వి ఉండేవి. కానీ ఐ ల‌వ్ యూ ర‌స్నా పేరుతో వ‌చ్చిన జింగిల్ ప్ర‌క‌ట‌న ఊహించ‌ని రీతిలో జ‌నానికి చేరింది.

 ప్ర‌ధానంగా చిన్నారుల మ‌న‌సు దోచేసింది. లిమ్కా, థంప్స్ అప్ వంటి కార్పొరేట్ పానియాలు భార‌త మార్కెట్ ను శాసిస్తున్న స‌మ‌యంలో రస్నా భార‌త్ మార్కెట్ లోకి ప్ర‌వేశించింది.

కానీ ఏ పానియం పిల్లల కోసం ప్ర‌త్యేకంగా కాక పోవ‌డం విశేషం. దీంతో ర‌స్నా పానియం 1970 చివ‌రి నుండి 1990 ప్రారంభం దాకా ప్ర‌తి ఇంట్లో,

స‌మావేశాల‌లో, ఫంక్ష‌న్లు, పెళ్లిల్ల‌లో, శుభ కార్యాల‌యాల‌లో ర‌స్నా భాగ‌మై పోయింది. ఆ త‌ర్వాత మెల మెల్ల‌గా ర‌స్నాను పోలిన పానియాల‌ను బ‌డా కార్పొరేట్ కంపెనీలు తీసుకు వ‌చ్చాయి.

కోకో కోలా, ట్రోపికానా వంటి పండ్ల ర‌సాల నుండి గ‌ట్టి పోటీని ఎదుర్కొంది. ముందుగా ర‌స్నాను జాఫ్ గా ప్రారంభించారు గుజ‌రాత్ లో. 1979లో ర‌స్నాను పునః ప్రారంభించారు. వోల్టాస్ ద్వారా పంపిణీ చేశారు.

1983లో మార్కెటింగ్ చేయ‌డం స్టార్ట్ చేశారు. ఫ‌రోజ్ ఖంబ‌ట్టా 1998లో కంపెనీకి చైర్మ‌న్, ఎండీ అయ్యారు. ర‌స్నాకు చిన్నారులు, పేరెంట్స్ టార్గెట్ . వాళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని ర‌స్నాకు ప్రాణం పోశారు.

కేవ‌లం ఒకే ఒక్క ప్యాక్ నుండి 32 గ్లాసుల పానియం ఎలా త‌యారు చేయ‌వ‌చ్చో హైలెట్ చేసింది. ఇదే మార్కెట్ లో స‌క్సెస్ అయ్యేందుకు దోహదం చేసింది. అనేక రుచుల‌ను ప‌రిచ‌యం చేసింది. 

వీటిలో కేస‌ర్ , ఎలైచి, ఖు, జల్జీరా ఉన్నాయి. 2000లో జామ‌, లిట్చీ, పుచ్చ‌కాయ‌, పైనాపిల్ వంటి కొత రుచుకుల‌ను ప‌రిచ‌యం చేసింది ర‌స్నా కంపెనీ. రూ. 600 కోట్ల‌కు పైగా వ్యాపారం చేసింది ర‌స్నా.

2004లో వాటా 90 శాతం ఉంటే 2010లో 97 శ‌తానికి చేరుకుంది. శీత‌ల పానీయాల మార్కెట్ 1982లో రూ. 13 కోట్ల నుంచి 2015 నాటికి రూ. 14,000 కోట్ల‌కు పెరిగితే ర‌స్నాలో 2.4 శాతం మాత్ర‌మే ఉంది. కార్పొరేట్ డ్రింక్స్ , పండ్ల ర‌సాలు మార్కెట్ ను ముంచెత్తాయి. దీంతో ర‌స్నాకు ఇబ్బంది ఏర్ప‌డింది.

ఏది ఏమైనా గ‌త మూడు ద‌శాబ్దాల‌లో ర‌స్నా త‌న‌దైన ముద్ర వేసింది. ర‌స్నా ఫ్రూట్ జ్యూస్ , హెల్తీ డ్రింక్ ఉత్ప‌త్తుల‌పై ఫోక‌స్ పెట్టింది. మొత్తంగా

భార‌తీయ మార్కెట్ లో ర‌స్నా సృష్టించిన ప్ర‌భంజ‌నం ముందు కార్పొరేట్ కంపెనీలు వెల వెల బోయాయి.

Also Read : ర‌స్నా ఫౌండ‌ర్ ‘ఖంబ‌ట్టా’ క‌న్నుమూత‌

Leave A Reply

Your Email Id will not be published!