ఓ వైపు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే కెప్టెన్ గా క్రీజులో ఉండి జట్టును ఆదుకోవాల్సింది పోయి చెత్త షాట్ తో తన వికెట్ ను సంజూ శాంసన్ సమర్పించు కోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఓపెనర్లు జోస్ బట్లర్ , యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ , గ్లెన్ మాక్స్ వెల్ , అనూజ్ రావత్ అద్బుతంగా రాణించారు. దీంతో భారీ స్కోర్ ముందుంచింది. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ ఆటగాళ్లు ఏ కోశాన ధీటుగా ఎదుర్కోలేక పోయారు ఆర్సీబీ బౌలర్లను. ఆ జట్టు స్కిప్పర్ డుప్లెసిస్ ఆటగాళ్లను కట్టడి చేశాడు.
ఆర్సీబీ బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు విల విల లాడారు. ఆడలేక చేతులెత్తేశారు. 5 గురు దిగ్గజ ఆటగాళ్లు డబుల్ డిజిట్ ను దాటలేక పోయారు. సంజూ శాంసన్ చెత్త షాట్ కొట్టి వికెట్ సమర్పించుకున్నాడు. వికెట్ కీపర్ అనూజ్ రావత్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేక పోయింది. ఇప్పటి దాకా శాంసన్ పై ఉన్న గౌరవం కాస్తా తగ్గినట్లు అనిపించింది. మొత్తంగా తన జట్టు ఓడి పోవడానికి కెప్టెన్ కారణమని చెప్పక తప్పదు.
దీంతో రాజస్థాన్ రాయల్స్ 112 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. నిన్నటి దాకా ప్రశంసలు పొందిన సంజూ శాంసన్ ఇవాళ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
