Cash Circulation Doubled : రద్దు తర్వాత పెరిగిన నోట్ల చలామణి
గత ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా
Cash Circulation Doubled : ఇది ఊహించని పరిణామం. నోట్ల రద్దు తర్వాత గత ఆరు ఏళ్లలో ప్రజల్లో నగదు చలామణి(Cash Circulation Doubled) దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. చెల్లింపులకు సంబంధించి డిజిటల్ ప్రత్యామ్నాయాలకు ప్రయారిటీ పెరిగింది. డిసెంబర్ 23, 2022 నాటికి ప్రజల వద్ద నగదు రూ. 32. 42 లక్షల కోట్లు. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది.
నల్లధనాన్ని లక్ష్యంగా చేసుకుని అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాత రూ. 1,000 , రూ. 500 నోట్లను నిషేధిస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. మోదీ ప్రకటించే కంటే కొన్ని రోజుల ముందు దేశంలో చెలామణిలో ఉన్న నదు నవంబర్ 4, 2016న రూ. 17.74 లక్షల కోట్లు. ఇక జనవరి 6, 2017 తో పోలిస్తే చలామణిలో ఉన్న నగదు 3 రెట్లు దాదాపు 260 శాతం పెరిగింది.
నవంబర్ 8, 2016న చెలామణిలో ఉన్న మొత్తం రూ. 15. 3 లక్షల కోట్ల నోట్ల విలువ రూ. 15.3 లక్షల కోట్లు లేదా 99.3 శాతం. ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మందగమనం ప్రజలను కష్టాల్లోకి నెట్టి వేసింది. చట్ట విరుద్దమైన కరెన్సీ నోట్ల స్థానంలో కొత్తగా 500, 200 రూపాయల నోట్లు వచ్చాయి.
కానీ 1,000 రూపాయల నోటును మళ్లీ ప్రవేశ పెట్టలేదు. డిసెంబర్ 19, 2022న లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందించిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం మార్చి 2017 చివరి నాటికి ఎన్ఐసీ వాల్యూ 20 శాతానికి పడి పోయింది. దాని విలువ రూ. 13.1 లక్షల కోట్లకు దిగజారింది. విలువ మాత్రమే కాదు నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది.
Also Read : నోట్ల రద్దు చట్ట విరుద్దం – నాగరత్న