Videocon Chairman Arrest : వీడియోకాన్ గ్రూప్ చైర్మ‌న్ అరెస్ట్

ఐసీఐసీఐ రుణ ఎగ‌వేత కేసు ఫ్రాడ్

Videocon Chairman Arrest : ఈ దేశంలో ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన వారు ఒక్క‌రొక్క‌రుగా అరెస్ట్ అవుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చందా కొచ్చ‌ర్ , భ‌ర్త అరెస్ట్ కాగా తాజాగా మ‌రో కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. వీడియోకాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి) – సిఇఓ , చైర్మ‌న్ వేణుగోపాల్ ధూత్ ను సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ సోమ‌వారం అరెస్ట్(Videocon Chairman Arrest) చేసింది.

ఇప్ప‌టికే ఐసీఐసీఐ మాజీ సీఇఓ చందా కొచ్చ‌ర్, భ‌ర్త దీప‌క్ కొచ్చ‌ర్ ల‌ను అదుపులోకి తీసుకున్న త‌ర్వాత ఆయ‌న‌ను అరెస్ట్ అదుపులోకి తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న స‌మ‌యంలో వీడియోకాన్ గ్రూప్ కు రూ. 3,000 కోట్ల‌కు పైగా రుణం మంజూరు చేశారు.

ఈ రుణం మంజూరీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపించిన కేసులో మాజీ సిఇఓను అరెస్ట్ చేసింది సీబీఐ. ఇప్ప‌టికే ముంబై కోర్టులో కొచ్చార్ దంప‌తుల‌ను హాజ‌రు ప‌రిచారు.

నేర పూరిత కుట్ర‌కు సంబ‌ధించిన ఐపీసీ సెక్ష‌న్ల కింద న‌మోదైన ఎఫ్ఐఆర‌ర్ లో దీప‌క్ కొచ్చ‌ర్ , సుప్రీం ఎన‌ర్జీ , వీడియోకాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ , వీడియోకాన్ ఇండ‌స్ట్రీస్ నిర్వ‌హిస్తున్న నూప‌వ‌ర్ రెన్యూవ‌బుల్స్ కంపెనీల‌తో పాటు కొచ‌ర్స్ , ధూత్ ల‌ను సీబీఐ నిందితులుగా పేర్కొంది సీబీఐ.

59 ఏళ్ల చందా కొచ్చ‌ర్ క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ , ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ఫ్లోరేష‌న్ కంపెనీ అయిన వీడియోకాన్ గ్రూప్ కు అనుకూలంగా ఉన్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో సిఇఓ, ఎండీగా 2018లో వైదొలిగారు.

Also Read : ఆధార్ తో పాన్ కార్డు లింకు త‌ప్ప‌నిసరి

Leave A Reply

Your Email Id will not be published!