CBI Sanjay Pandey : ముంబై మాజీ పోలీస్ చీఫ్ పై సీబీఐ కేసు
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ
CBI Sanjay Pandey : ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేపై(CBI Sanjay Pandey) కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. ఐసెక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చట్ట విరుద్దంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారంటూ సీబీఐ ఆరోపించింది.
2009-17 మధ్య కాలంలో సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ ల ఉద్యోగుల ఫోన్ లను చట్ట విరుద్దంగా ట్యాప్ చేసింది. ఇదిలా ఉండగా సంజయ్ పాండే
ఐసెక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ని 2001లో స్థాపించారు.
ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సంజయ్ పాండేతో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్
ఎగ్జిక్యూటివ్ చిత్రా రామకృష్ణపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఎస్ఎస్ఈ మాజీ సిఇఓ రవి నరైన్ పేరు కూడా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకకు దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఐదు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో సంజయ్ పాండేకు(CBI Sanjay Pandey) సంబంధించిన ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అక్రమంగా స్టాక్ ఎక్స్ఛేంజీలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన ఫోన్ లను అక్రమంగా ట్యాప్ చేసింది.
కంపెనీ సెక్యూరిటీ ఆడిట్ ను కూడా నిర్వహించినట్ల తెలిపింది. ఇదిలా ఉండగా సంజయ్ పాండే ముంబై పోలీస్ కమిషనర్ నుండి వైదొలిగాక
కంపెనీని స్థాపించారు. మే 2006లో సంస్థ కు సంబంధంచిన డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నాడని సీబీఐ పేర్కొంది.
ఆ తర్వాత సంజయ్ పాండే వైదొలిగాక కొడుకు, తల్లి కంపెనీ బాధ్యతలు చేపట్టారని స్పష్టం చేసింది. పాండే రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం
ఆమోదించక పోవడంతో మళ్లీ చేరారు. కానీ వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదు.
Also Read : రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఎంపీలు ఎటు వైపు