Calcutta HC : కోల్ కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇప్పటికే సీబీఐని ఆదేశించింది కోర్టు.
ఇందులో భాగంగా బొగ్తుయ్ గ్రామంలో జరిగిన 9 మంది సజీవ దహనం ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు గతంలో ఆదేశించింది.
ఈ మేరకు విచారణ కూడా ప్రారంభమైంది. ఈ తరుణంలో బీర్బూమ్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత హత్యపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. రాజకీయ నాయకుడి హత్యకు ప్రతీకారంగా తొమ్మిది మందిని కాల్చి చంపారు.
ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – సీబీఐ మార్చి 21న బోగ్తుయ్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. బీర్బూమ్ వ్యవహారం దేశాన్ని ఒక్కసారిగా కదిలించేలా చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బదు షేక్ హత్యతో పాటు ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.
షేక్ హత్య కేసును సమగ్ర దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ న్యాయమూర్తులు ఇవాళ ఆదేశించారు.
స్థానిక పంచాయతీ డిప్యూటీ చీఫ్ షేక్ హత్య జరిగిన గంట వ్యవధిలోనే బొగ్తుయ్ వద్ద హింస చోటు చేసుకుందని రాష్ట్ర పోలీస్ చీఫ్ మార్చి 22న తెలిపారు.
ఇదిలా ఉండగా బీర్బూమ్ హత్యలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న నలుగురు బెంగాల్ వాసులను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం మీద సీబీఐకి రెండు కేసులు అప్పగించడం కలకలం రేగింది.
Also Read : సీజేఐ రమణ కీలక కామెంట్స్