CBI IPL Betting Racket : రూ. 11 కోట్ల ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్
పాక్ లింక్ లపై సీబీఐ విచారణ షురూ
CBI IPL Betting Racket : క్రికెట్ బెట్టింగ్ లో నిమగ్నమైన వ్యక్తుల నెట్ వర్క్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇన్ పుట్ ల ఆధారంగా ఐపీఎల్ మ్యాచ్ ల ఫలితాలపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించింది సీబీఐ(CBI IPL Betting).
ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ, జోధ్ పూర్ , జైపూర్ , హైదరాబాద్ లో ఉన్న కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు, తెలియని పబ్లిక్ సర్వెంట్స్ పై ఆరా తీస్తోంది.
నిందితులు తమ డబ్బుల్ని ఐపీఎల్ బెట్టింగ్ లో పెట్టేందుకు ప్రజలను ప్రేరేపించేందుకు పాన్ ఇండియా నెట్ వర్క్ నడిపారని సీబీఐ(CBI IPL Betting) ఆరోపించింది.
నేరపూరిత కుట్ర, మోసం, భారత శిక్షాస్మృతి ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టం కింద కేంద్ర ఏజెన్సీ రెండు కేసులను నమోదు చేసింది సీబీఐ.
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇన్ పుట్ ల ఆధారంగా ఐపీఎల్ మ్యాచ్ ల ఫలితాలను ప్రభావితం చేసే క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్న వ్యక్తుల
నెట్ వర్క్ గురించి విశ్వసనీయ సమాచారం అందింది.
వారు సాధారణ ప్రజలను బెట్టింగ్ లకు ప్రేరేపిస్తూ మోసం చేస్తున్నారంటూ సీబీఐ తన ప్రాథమిక దర్యాప్తులో పేర్కొంది. నకిలీ గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతాలను కూడా తెరిచారని తెలిపింది.
అంతే కాకుండా బెట్టింగ్ కోసం దేశంలోని ప్రజల నుండి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని హవాలా ద్వారా లావాదేవీలు చేపట్టి
విదేశాలలో ఉన్న వారి సహచరులు పంచుకుంటున్నట్లు సీబీఐ గుర్తించింది(CBI IPL Betting).
నిందితులు వకాస్ మాలిక్ అనే పాకిస్తానీ జాతీయుడితో టచ్ లో ఉన్నారని స్పష్టం చేసింది. దర్యాప్తులో అతడి నంబర్ కూడా ట్రేస్ చేసినట్లు వెల్లడించింది.
దిలీప్ కుమార్, గుర్రం సతీష్ , గుర్రం వాసు లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2013 నుంచి బెట్టింగ్ లో పాల్గొంటున్నట్లు సీబీఐ గుర్తించింది.
Also Read : చివరి ఐపీఎల్ అంటూ ట్వీట్ ఆపై తొలగింపు