CBI Raids DY CM : ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడి

లిక్క‌ర్ పాల‌సీపై అవినీతి ఆరోప‌ణ‌లు

CBI Raids DY CM : కేంద్రం మ‌రోసారి జూలు విదిల్చింది. మ‌రోసారి ఢిల్లీ ఆప్ స‌ర్కార్ ను టార్గెట్ చేసింది. సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు స‌పోర్ట్ గా ఉంటూ వ‌చ్చిన మంత్రి స‌త్యేంద్ర జైన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది.

తాజాగా డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. గ‌త కొంత కాలంగా ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన లిక్క‌ర్ పాల‌సీపై అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది.

ఈ మేర‌కు కీల‌కంగా భావిస్తున్న మ‌నీష్ సిసోడియాపై సీబీఐ దాడుల‌కు దిగింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో ఆప్ ప్ర‌భుత్వం ప్రారంభించిన కొత్త ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీలో అంతులేని అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోప‌ణ‌లు గుప్పించింది.

ఈ మేర‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ దాఖ‌లు చేసింది. ఈ మేర‌కు ద‌ర్యాప్తు ప్రారంభించింది. కాగా డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు చేయ‌డాన్ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ కు చెందిన మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు.

ఇది పూర్తిగా క‌క్ష సాధింపు చ‌ర్య త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని మ‌నీష్ సిసోడియా ఇంటితో పాటు ఏడు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు(CBI Raids DY CM) చేప‌ట్టింది.

ఢిల్లీ మాజీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఏ. గోపీకృష్ణ డామ‌న్ , డ‌య్యూలోని ఇంటిలో కూడా సోదాలు నిర్వ‌హించింది. ఎక్సైజ్ పాల‌సీ కింద మ‌ద్యం షాపుల‌ను ప్రైవేట్ ఆట‌గాళ్ల‌కు కేటాయించిన‌ట్లు ఆరోపణ‌లు ఉన్నాయి.

ఇంకా సోదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశ రాజ‌ధానిలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : బీజేపీ పంతం కేజ్రీవాల్ అంతం – చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!