Twitter Blue Tick : డ‌బ్బులు క‌డితేనే బ్లూ టిక్

ప్ర‌ముఖుల‌కు ట్విట్ట‌ర్ షాక్

Twitter Blue Tick : టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే 12 వేల మందికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించారు. ఆ త‌ర్వాత మిగ‌తా ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, త‌దిత‌ర రంగాల‌కు చెందిన దిగ్గ‌జ కంపెనీలు మ‌స్క్ బాట‌ను అనుస‌రించాయి.

ఒక్కో కంపెనీ ఏకంగా 10 వేల నుంచి 20 వేలకు పైగా ఉద్యోగుల‌ను తొల‌గించాయి. ట్విట్ట‌ర్ ను రూ. 4,400 కోట్ల‌కు కొనుగోలు చేసి అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసిన ఎలోన్ మ‌స్క్ వ‌చ్చీ రావ‌డంతోనే సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీశారు. ప‌లు చోట్ల ఆఫీసుల‌ను మూసి వేశాడు. ఎవ‌రైతే క‌చ్చితంగా స‌మయానికి మించి ప‌ని చేస్తారో వారే ఉంటార‌ని మిగ‌తా వారికి చోటు లేదంటూ హెచ్చ‌రించారు.

అంతే కాదు వ‌చ్చీ రావ‌డంతోనే ట్విట్ట‌ర్ లో కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాడు. ట్విట్ట‌ర్ లో ఖాతాలు క‌లిగిన వారిలో ఎక్కువ మంది ప్ర‌ముఖులు, వివిధ రంగాల‌కు చెందిన వారున్నారు. చాలా మందికి బ్లూ టిక్(Twitter Blue Tick) క‌లిగి ఉన్న వారికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది.

దీనిపై ఫోక‌స్ పెట్టారు ఎలోన్ మ‌స్క్. ఇక నుంచి బ్లూ టిక్ క‌లిగి ఉన్న వారికి ఉచితంగా సేవ‌లు ఉండ‌వ‌ని ప్ర‌క‌టించాడు. ఆ మేర‌కు డ‌బ్బులు చెల్లించాల్సిందేన‌ని అల్టిమేటం ఇచ్చాడు. డ‌బ్బులు క‌ట్ట‌ని ప్ర‌ముఖుల‌కు బ్లూ టిక్ మార్క్ ను తొల‌గిస్తోంది ట్విట్ట‌ర్. 

ఇక భార‌త్ కు చెందిన ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు, సినీ న‌టులు, ఆట‌గాళ్లు చాలా మందికి ఉన్న బ్లూ టిక్ ను తీసేసింది. ఈ తొల‌గించిన జాబితాలో సీఎం జ‌గ‌న్ , మాజీ సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , రాహుల్ , ప్రియాంక గాంధీ ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ , అమితాబ్ బ‌చ్చ‌న్, షారుఖ్ ఖాన్ కు చెందిన బ్లూ టిక్ లు తొల‌గించింది. స‌బ్ స్క్రైబ్ చేసుకున్న వాళ్ల‌వి అలాగే ఉంచింది.

Also Read : ‘కూ’ కూసింది ఉద్యోగుల‌ను కాటేసింది

Leave A Reply

Your Email Id will not be published!