Hollywood Stars Hinduism : హిందూ మతంపై సెలబ్రిటీల ఆసక్తి
పలువురు ఆధ్యాత్మికం వైపు ఆకర్షితులు
Hollywood Stars Hinduism : భారత దేశాన్ని కలిపి ఉంచుతున్న ఏకైక మతం హిందూ మతం. ఇది మతం కాదు ఓ జీవన విధానం అని నమ్ముతున్నారు. వీరిలో అన్ని వర్గాలకు చెందిన వారున్నారు. క్రీడాకారులు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు. ప్రధానంగా అమెరికాకు చెందిన చాలా మంది ఈ మతం పట్ల మరింత గౌరవాన్ని కలిగి ఉంటున్నారు.
వరల్డ్ వైడ్ గా ఒక బిలియన్ మంది ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. ఆచరిస్తున్నారు. ప్రధానంగా ప్రపంచాన్ని నివ్వెర పరిచేలా చేస్తున్న షాపింగ్ మోడ్ ఆపిల్ కు చెందిన స్టీవ్ జాబ్స్ తో పాటు ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకెర్ బర్గ్ , మరికొందరు ప్రముఖులు సైతం ఆధ్యాత్మితక కోసం భారత దేశాన్ని సందర్శించారు.
వీరితో పాటు చాలా మంది హాలీవుడ్ స్టార్స్(Hollywood Stars Hinduism) దీని పట్ల ప్రేమను కలిగి ఉన్నారు. వారు పుట్టుకతో హిందువులు కారు. కానీ రాను రాను ఈ మతం పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. వీరిలో కెల్లీ విలియమ్స్ ప్రసిద్ద నటి. ఎన్నో లీడ్ రోల్స్ లలో నటించింది. మెప్పించింది కూడా. హిందూ మతం బోధనలు ఇష్టపడింది.
తన భర్త అజయ్ సహగల్ ను 1996లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత హిందూ మతం మార్చుకుంది. మరొకరు సత్స్వ రూప దాస గోస్వామి. భక్తి వేదాంతం స్వామి సీనియర్ శిష్యుడిగా పేరొందారు. ఆయనకు 79 ఏళ్లు ఉన్నాయి. ఇస్కాన్ స్థాపకుడు. మరొకరు సత్యానంద స్టోక్స్ . ఆయన బ్రిటీష్ భారతీయుడు అయ్యాడు.
ఇక క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న జూలియా రాబర్ట్స్ హిందూ మతంలోకి మారారు. హాలీవుడ్ లో ప్రముఖ నటి. నిర్మాత కూడా. మరొకరు కృష్ణ దాస్ . ఆయనను అమెరికన్ యోగా చాంట్ మాస్టర్ అని పిలుస్తారు. హిందూ భక్తి సంగీత కీర్తనలకు ప్రసిద్ది పొందారు.
17 ఆల్బమ్ లు రిలీజ్ చేశాడు. ప్రముఖ సంగీత స్వరకర్త జాన్ కోల్ట్రేన్. తన రెండవ భార్యతో కలిసి హిందూ మతంలోకి మారాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అమెరికాను ప్రభావితం చేస్తున్న వారంతా హిందూ మతంలోని గొప్పదనాన్ని, ప్రత్యేకించి ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తున్నారు.
ఇక ప్రముఖ దిగ్గజ నటుడిగా పేరొందిన విల్ స్మిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఒక రకంగా భారత్ కు మరో గుర్తింపు తెచ్చేలా చేస్తోంది.
Also Read : ఐసీయూలో సూపర్ స్టార్ కృష్ణ