Rail Road Bridge : వారణాసిలో రూ.2642 కోట్లతో రైల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

లోయర్ డెక్‌లో 4 రైల్వే లైన్లు, అప్పర్ డెక్‌‌పై 6 లేన్ల హైవే ఉంటుంది...

Rail Road Bridge : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసి(Varanasi)లో గంగానదిపై కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనసామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలోని అతి పెద్ద వంతెనల్లో ఇదొకటి అవుతుందని క్యాబినెట్ సమావేశానంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. కొత్త రైల్-రోడ్ బ్రిడ్జిని రూ.2,642 కోట్లతో నిర్మించనున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ” మాల్వీయ బ్రిడ్జి కట్టి 137 ఏళ్లయింది. ఇప్పుడు కొత్త బ్రిడ్జి నిర్మాణం జరపనున్నాం. లోయర్ డెక్‌లో 4 రైల్వే లైన్లు, అప్పర్ డెక్‌‌పై 6 లేన్ల హైవే ఉంటుంది. ట్రాఫిక్ కెపాసిటీ దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద బ్రిడ్జిలలో ఇదొకటి అవుతుంది” అని మంత్రి తెలిపారు.

Rail Road Bridge in Varanasi

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి-చౌందాలి జిల్లాల గుండా కొత్త వంతెన నిర్మాణం జరుగనుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ రైల్వేస్‌కు క్రూషియల్ హబ్‌గా వారణాసి రైల్వే స్టేషన్ ఉందని, యాత్రికులు, పర్యాటకులు, స్థానిక జనాభాకు గేట్‌వేగా నిలుస్తోందని పేర్కొంది. పెరుగుతున్న టూరిజం, ఇండస్ట్రియల్ డిమాండ్‌కు అనుగుణంగానే కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మాణం జరగనుందని తెలిపింది. ఇందువల్ల ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ప్రధాన మంత్రి మోదీ ‘న్యూ ఇండియా’ విజన్, ‘ఆత్మ నిర్భర్ భారత్’ విజన్‌ దిశగా ఇదొక ముందడుగు అని అభివర్ణించింది.

Also Read : Amit Shah Meet : హర్యానా గవర్నర్ ను కలిసి కొత్తప్రభుత్వ ఏర్పాటుకు వినతులిచ్చిన షా, సైనీ

Leave A Reply

Your Email Id will not be published!