Centre To Supreme Court : భారతీయ విద్యార్థులకు షాక్
కాలేజీల్లో చేర్చుకోలేమన్న కేంద్రం
Centre To Supreme Court : ఉక్రెయిన్ నుంచి భారత్ కు వచ్చిన విద్యార్థులకు కోలుకోలేని షాక్ తగిలింది. వారిని తమ కాలేజీల్లో చేర్చుకోలేమంటూ చావు కబురు చల్లగా చెప్పింది కేంద్రం.
ఈ మేరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టుకు(Centre To Supreme Court) సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ భారతీయ విద్యార్థులు రష్యాతో యుద్దం కారణంగా తిరిగి భారత్ కు వచ్చారు.
అయితే వారికి భారత్ లోని మెడికల్ కాలేజీల్లో వసతి కల్పించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఏ భారతీయ వైద్య సంస్థ,
యూనివర్శిటీలో విదేశీ వైద్య విద్యార్థులను బదిలీ చేసేందుకు లేదా వసతి కల్పించేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది.
విశ్వ విద్యాలయాల్లో మొదటి నుండి నాల్గవ సంవత్సరం బ్యాచ్ ల అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు చదువుతున్నారు.
ప్రాథమికంగా తమ సంబంధిత సెమిస్టర్ లలో భారత దేశంలోని వైద్య కాలేజీలకు బదిలీ చేయాలని కోరుతూ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి తన ప్రతిస్పందనను తెలియ చేసింది కేంద్రం.
Also Read : జిన్ పింగ్ తో విందుకు మోదీ దూరం