Centre Notices TS Govt : కేసీఆర్ స‌ర్కార్ కు కేంద్రం డెడ్ లైన్

దారి మ‌ళ్లించిన నిధులు చెల్లించాల్సిందే

Centre Notices TS Govt : కేంద్రంలోని మోదీ స‌ర్కార్ కు రాష్ట్రంలోని కేసీఆర్ ప్ర‌భుత్వానికి పొస‌గ‌డం లేదు. మొద‌ట్లోనే బాగానే ఉన్నారు. ప్ర‌శంస‌లు కురిపించారు. ఆహా ఓహో అన్నారు. ఆపై బీజేపీ తీసుకు వ‌చ్చిన ప్ర‌తి బిల్లుకు ఓకే చెప్పారు. చివ‌ర‌కు ఏమైందో ఏమో కానీ నువ్వా నేనా అంటూ మాట‌ల‌తో మంట‌లు రాజేస్తున్నారు.

దీంతో ఆధిప‌త్యం దిశ‌గా చ‌ర్య‌లు, నిర్ణ‌యాలు ఉంటున్నాయి. తాజాగా కేంద్రం కోలుకోలేని షాక్ ఇచ్చింది రాష్ట్ర స‌ర్కార్ కు. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, వాటికి సంబంధించి నిధులు మంజూరు చేస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లు కోసం నిధులు వ‌చ్చాయి.

కాగా వాటిని దాని కోసం కాకుండా ఇత‌ర ప‌నుల‌కు మ‌ళ్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇంకో వైపు ప‌క్క‌దారి ప‌ట్టిన‌ట్లు కేంద్రం భావిస్తోంది. దీంతో ఖ‌ర్చు చేయ‌కుండా మిగిలి పోయిన నిధుల‌తో పాటు ఎంజీఎన్ఈజీఎస్ ప‌థ‌కం కింద దారి మళ్లించిన నిధుల‌ను న‌వంబ‌ర్ 30 లోగా అంటే 48 గంట‌లు లోపు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇందుకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌క్క‌దారి ప‌ట్టించిన రూ. 152 కోట్ల‌ను వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఈ నోటీసులు(Centre Notices TS Govt)  జారీ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. ఆ నిధులు చెల్లించ‌క పోతే మిగ‌తా నిధుల‌ను విడుద‌ల చేయ‌బోమంటూ స్ప‌ష్టం చేసింది కేంద్రం.

ఇదిలా ఉండ‌గా గ‌త జూన్ నెల‌లో కేంద్ర టీం రాష్ట్రంలో ప‌ర్య‌టించింది. అక్ర‌మాల‌ను గుర్తించింది. సమ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించింది. దీంతో నోటీసులు వ‌చ్చాయి.

Also Read : ప్ర‌జ‌ల‌ను క‌లుస్తం పాద‌యాత్ర ఆపం – బండి

Leave A Reply

Your Email Id will not be published!