Social Media Centre : సోషల్ మీడియాకు కేంద్రం ముకుతాడు
కొత్తగా మార్గదర్శకాలు జారీకి ప్రయత్నం
Social Media Centre : కేంద్రంలో కొలువుతీరిన మోదీ ప్రభుత్వం మొదటి నుంచి సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు)పై ఫోకస్ పడుతూ వస్తోంది. తమకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిని ఓ కంట కనిపెడుతోంది.
వారిపై జూలు విదులుస్తోంది. విచిత్రం ఏమిటంటే అదే సోషల్ మీడియాను(Social Media Centre) ఎక్కువగా వాడుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీ దాని అనుబంధ సంస్థలే కావడం విశేషం.
తాజాగా కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను నియంత్రించేందుకు ఫ్రేమ్ వర్క్ (మార్గదర్శకాలు)ను ప్రవేశ పెట్టనుంది.
ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది కేంద్రం. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో పాటు రూల్స్ కూడా ప్రవేశ పెడతామని తెలిపింది.
ఆయా సామాజిక మాధ్యమాలలో ఖాతాలు కలిగి ఉన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకునేలా రంగం సిద్దం చేస్తోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ధర్మాసనం ముందు ట్విట్టర్ తో సహా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల ద్వారా సోషల్ మీడియా ఖాతాల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల బ్యాచ్ పై విచారణ చేపట్టింది కోర్టు.
కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, ఇప్పటికే ఆ పనిలో ఉందని కోర్టుకు విన్నవించారు.
దీంతో సోషల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్రం ముకుతాడు వేసే పనిలో ఉందన్నమాట. ప్రస్తుతం ప్రచురణ, ప్రసార మాధ్యమాల కంటే సోషల్ మీడియాలోనే జనం ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు. తమ వాయిస్ ను వినిపిస్తున్నారు.
Also Read : బీసీసీఐ నిర్వాకం భారత్ కు శాపం