Chadalavada Nagarani : 1510 మందికి ఇంజనీరింగ్ సీట్లు
ఏపీఈఏపీసెట్ 2023 కన్వీనర్ నాగరాణి
Chadalavada Nagarani : అమరావతి – ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియలో 1510 మందికి సీట్లు కేటాయించినట్లు ఎపిఈఎపిసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉన్నత విద్యా మండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్-2023 లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియను నిర్దేశించగా, 1735 మంది ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారన్నారు.
Chadalavada Nagarani Comment for Admissions
కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే వర్తించేలా ఈ కౌన్సిలింగ్ ను చేపట్టామని పేర్కొన్నారు. తొలి, మలి దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్ ను సద్వినియోగం చేసుకున్నారని నాగరాణి వెల్లడించారు.
విద్యార్ధుల నుండి భిన్న రూపాలలో వచ్చిన అభ్యర్ధనల ఫలితంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ కు అనుమతి ఇచ్చారని, విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ ప్రత్యేక చొరవ చూపారని నాగరాణి పేర్కొన్నారు.
ప్రత్యేక రౌండ్ లో చేసిన ప్రవేశాలకు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు అనుమతి ఉందని కన్వీనర్ వివరించారు. సీట్లు కేటాయించిన కళాశాలలో నవంబరు 14వ తేదీ లోపు విద్యార్ధులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉందని కమిషనర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.
Also Read : Vijayashanti : కాషాయానికి షాక్ రాములమ్మ జంప్