Chaganti Somayajulu: చాసోగా సుపరితం అయిన ప్రముఖ రచయిత
అభ్యుదయ వాదిగా నిలబడిన వాస్తవిక వాది చాగంటి సోమయాజులు
చాగంటి సోమయాజులు
Chaganti Somayajulu : చాగంటి సోమయాజులు (1915, జనవరి 15 – 1994 జనవరి 1): అభ్యుదయ వాదిగా నిలబడిన వాస్తవిక వాదిగా పేరొందిన చాగంటి సోమయాజులు శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. చాసోగా సుపరిచితం అయిన చాగంటి సోమయాజులు(Chaganti Somayajulu) కళాశాల విద్యార్థిగానే కవితారచనకి శ్రీకారం చుట్టారు. తొరుదత్, సరోజినీ నాయుడు ల కవిత్వం, లియో టాల్స్టాయ్, మాక్సిం గోర్కీ ల కళాత్మక వ్యక్తీకరణ, ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేశాయి. సృజనాత్మక ప్రక్రియలైన కథ, కవిత్వం, రెండింటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చినా తర్వాతి కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్యమిచ్చాడు.
Chaganti Somayajulu- చాసో రచనా ప్రస్థానం
చాసో గా సుపరిచితం అయిన చాగంటి సోమయాజులు మొట్టమొదటి రచన ‘చిన్నాజీ’. 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైన ‘చిన్నాజీ’ సమాజంలో అట్టడుగు, దిగువ, మధ్య తరగతి సహా ఉన్నత వర్గాల్లోని దోపిడీ వ్యవస్థను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధనస్వామ్య వ్యవస్థ వీరి ప్రధానంగా ఉన్నాయి. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. చాసో కేవలం 46 కథలనే రాసినప్పటికీ తెలుగ కథా సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో మొదటి కథా సంకలనం వెలువడింది.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బర్మాపై జపాన్ బాంబు దాడులు జరిపాక, బర్మా నుండి అనేక తెలుగు కుటుంబాలు కట్టుబట్టలతో కాలినడకతో స్వగ్రామాలు చేరినప్పుడు ఇక్కడి దుర్భరస్థితిని ఒక తల్లి హృదయావేదనగా చాసో అక్షరీకరించాడు. తాను నడయాడిన ప్రాంతాల్లోని భాషల్ని, యాసల్ని పట్టుకుని తానెరిగిన జీవితానుండి కథలు సృష్టించారు. కుంకుడాకు, పరబ్రహ్మం, మాతృధర్మం, బొండుమల్లెలు, కుక్కుటేశ్వరం, బొచ్చు తువ్వాలు, ఏలూరెళ్లాలి, వేలం, వెంకడు, ఎందుకు పారేస్తాను నాన్నా అనేవి చాసో రచనల్లో ముఖ్యమైనవి.
అరసంతో చాసో బంధం
1943 నుంచి కన్నుమూసే వరకూ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) లోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు.
చాసో స్పూర్తి సాహితీ పురస్కారం
చాసో పెద్ద కుమార్తె చాగంటి తులసి ‘చాసో స్ఫూర్తి’ పేరిట ఒక ట్రస్ట్ నెలకొల్పి 1995 నుంచి ప్రతి ఏటా చాసో జన్మదినం జనవరి 17న సృజనాత్మక సాహిత్య వికాసానికి, నిబద్ధతతో కృషి చేస్తున్న అభ్యుదయ రచయితలలో ఒకరికి ‘చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం’ అందిస్తున్నారు.
Also Read : Potturi Vijayalakshmi: ప్రముఖ తెలుగు హస్య కథా రచయిత