Potturi Vijayalakshmi: ప్రముఖ తెలుగు హస్య కథా రచయిత

ప్రముఖ తెలుగు హస్య కథా, నవలా రచయిత పొత్తూరి విజయలక్ష్మి

పొత్తూరి విజయలక్ష్మి

Potturi Vijayalakshmi : పొత్తూరి విజయలక్ష్మి: ప్రముఖ కధా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గుంటూరు జిల్లా యాజలి లో జూలై 18, 1953న జన్మించారు. హస్య కథలకు, నవలలకు ఈమె ప్రశిద్ధి.

Potturi Vijayalakshmi – రచయితగా విజయలక్ష్మి ప్రస్థానం

1982 రచనలు ప్రారంభించిన పొత్తూరి విజయలక్ష్మి మొదటి నవల ప్రేమలేఖ. ఈ నవలను శ్రీ వారికి ప్రేమలేఖ సినిమాగా రూపొందించారు. ప్రేమలేఖ నవలతో పాఠక లోకానికి పరిచయమైన విజయలక్ష్మి… చక్కని కథా వస్తువు, సునిశిత హాస్యం, కొంత వ్యంగ్యం, మోతాదు మించని రచనా శైలితో పాఠకులను ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు సమాజంలో, ప్రజల జీవితాలలో చోటు చేసుకునే మార్పులు, వాటి వల్ల కలిగే ఇబ్బందులు, వచ్చి పడే సమస్యలు, తెచ్చి పెట్టుకునే తంటాలు, పరిష్కారాలు తెలియక, తెలిసినా అమలు చేత కాక పడే తిప్పలకు హాస్యం, వ్యంగాలను మేళవించి రచనలుగా సాహితీ లోకానికి పరిచయం చేసారు.

విజయలక్ష్మి(Potturi Vijayalakshmi) కథలు అన్నీ దాదాపు కుటుంబం, కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతుంటాయి. తరాల అంతరం, మనస్తత్వాలు, వాటి వల్ల ఏర్పడే సంఘర్షణ వంటి వాటిని మోతాదు మించకుండా చిత్రించడం వల్లనే శ్రీమతి విజయలక్ష్మి కథలు రక్తి కడతాయి. ఈమె కథలలో అశ్లీలం, అసభ్యత మచ్చుకకు కనిపించక పోగా, చాల మటుకు పాత్రలు సంస్కారవంతగా ఉండి, ఆశావహ దృక్పథంతో నడుచుకుంటాయి. పొత్తూరి విజయలక్ష్మి ఇప్పటివరకు 200 కథలు, 14 నవలలు, 3 సినిమాలు, 2 టీవీ సీరియల్స్ రూపొందించారు. ఈమె రచనలు రేడియోలో నాటికలుగా ప్రసారమయ్యాయి. ఈమె రాసిన హాస్య కథలు “పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు, మా ఇంటి రామాయణం, చంద్ర హారం, అందమె ఆనందం” అనే హాస్యకథా సంపుటాలుగా వెలువడ్డాయి.

విజయలక్ష్మిని వరించిన పురష్కారాలు

అచ్చ తెలుగు నుడికారముతో హస్యకథ, నవలా రచయిగా గుర్తింపు పొందిన విజయలక్ష్మిని 2007లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2007లో తురగా కృష్ణమోహనరావు గారి స్మారక పురస్కారం, 2009లో శేషారత్నం స్మారక హాస్యకథా పురస్కారాలు వరించాయి.

Also Read : Kaloji Narayana Rao: ప్రజాకవి కాళోజీ

Leave A Reply

Your Email Id will not be published!