Chamundeshwara Nath : ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో చాముండి
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో పోస్ట్
Chamundeshwara Nath : హైదరాబాద్ – మాజీ క్రికెటర్ వి. చాముండేశ్వర నాథ్ కు అరుదైన అవకాశం తలుపు తట్టింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) గవర్నర్ కౌన్సిల్ లో ఇప్పటి దాకా ప్రతినిధిగా ఉన్న ప్రజ్ఞాన్ ఓజా వైదొలిగాడు. దీంతో ఓజా స్థానంలో ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) ప్రతినిధిగా వి. చాముండేశ్వర్ నాథ్ కు ఛాన్స్ లభించింది.
Chamundeshwara Nath Got A Chance
చాముండేశ్వర నాథ్ కు చాముండి అని మరో పేరు ఉంది. దేశీవాలి క్రికెట్ లో ఆంధ్రా జట్టు తరపున ఆడాడు. 2009లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఆడిన భారత క్రికెట్ జట్టుకు మేనేజర్ గా ఉన్నాడు. ప్రస్తుతం చాముండేశ్వర్ నాథ్(Chamundeshwara Nath) వయసు 64 ఏళ్లు. గతంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జూనియర్ సెలెక్షన్ కమిటీలో కూడా పని చేశాడు చాముండేశ్వర నాథ్.
2023కి సంబంధించి ఐసీఏ ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఫలితాలు వెల్లడి అయ్యాయి. అధికారిక వెబ్ సైట్ లో వివరాలు పొందు పర్చారు. మొత్తం 545 ఓట్లలో చాముండికి 317 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి గా ఉన్న హర్విందర్ సింగ్ కు 228 ఓట్లు వచ్చాయి. దీంతో ఐసీఏ ప్రతినిధి పోస్ట్ చాముండేశ్వర్ నాథ్ కు దాదాపు ఖరారైనట్టే.
ఇదిలా ఉండగా వి. చాముండేశ్వర్ నాథ్ కు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సచిన్ రమేష్ టెండూల్కర్ సపోర్ట్ ఉంది. అందుకే మనోడిని ఎవరూ టచ్ చేయరు.
Also Read : Ponnala Lakshmaiah : రాహుల్ పై పొన్నాల కన్నెర్ర