Yogi Cabinet : యోగి కేబినెట్ లో 48 మందికి ఛాన్స్

25న యూపీలో ముహూర్తం ఫిక్స్

Yogi Cabinet : యూపీలో కాషాయ జెండా ఎగుర వేసిన యోగి (Yogi Cabinet)మ‌రోసారి సీఎంగా కొలువు తీర‌నున్నారు. భారీ ఎత్తున ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈనెల 25న ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఆరోజు శాస‌న‌స‌భా ప‌క్ష మీటింగ్ కొన‌సాగుతుంది. ప్ర‌ధాని మోదీ (Prime Minister Modi) , కేంద్ర మంత్రులతో పాటు 200 మందికి పైగా ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నారు. 48 మంది మంత్రుల‌తో క‌లిసి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

కొలువు తీరే కొత్త మంత్రివ‌ర్గంలో అన్ని వ‌ర్గాల‌కు, కులాల‌కు, ప్రాంతాల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌నున్నారు. 60 మంది పేర్ల‌తో జాబితాను సిద్దం చేసింది. ఇందులో ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

డిప్యూటీ సీఎం మౌర్య‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్లు స‌మాచారం. సీరతు స్థానం నుంచి ఓడి పోయినా చివ‌ర‌కు పార్టీ హైక‌మాండ్ మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చేందుకు ఓకే అన్న‌ట్టు టాక్.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 11 మంది గ‌తంలో కొలువు తీరిన మంత్రులు ప‌రాజ‌యం పాల‌య్యారు. టాప్ మినిష్ట‌ర్లకు ఓట‌ర్లు షాక్ ఇచ్చారు.

పార్టీలో కీల‌కంగా ఉన్న రాజేంద్ర ప్ర‌తాప్ సింగ్ , ఆనంద్ స్వ‌రూప్ , ఉపేంద్ర తివారీ, స‌తీష్ చంద్ర ద్వివేది, ల‌ఖ‌న్ సింగ్ రాజ్ పుత్ , సంగీతా బ‌ల్వంత్ , ర‌ణ‌వేంద్ర సింగ్ ధున్నీ, ఛ‌త్ర‌పాల్ సింగ్ గంగ్వార్ ఘోరంగా ఓడి పోయారు.

ఒక ర‌కంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇది షాకింగ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 317 సీట్లు గెలుపొందింది బీజేపీ. 2022లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 273 సీట్లు తెచ్చుకుంది.

ఓ ర‌కంగా ఓటు బ్యాంక్ త‌గ్గింది. అనూహ్యంగా స‌మాజ్ వాది పార్టీకి పెరిగింది. ఇక కాంగ్రెస్ 2 సీట్ల‌తో, బీఎస్పీ ఒక్క సీటుతో స‌రి పెట్టుకుంది.

Also Read : దేశం కోసం మోదీ నిద్ర‌కు దూరం

Leave A Reply

Your Email Id will not be published!