Sanju Samson Return : సంజూ శాంసన్ పునరాగమనం
విండీస్ టూర్ కు ఎంపికయ్యే ఛాన్స్
Sanju Samson Return : కేరళ స్టార్ బ్యాటర్ , రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ భారత జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం పలువురు ఆటగాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటోంది. రోహిత్ శర్మకు బదులుగా వచ్చే నెలలో వెస్టిండీస్ లో పర్యటించ బోయే భారత క్రికెట్ టెస్టు క్రికెట్ జట్టుకు అజింక్యా రహానేను ఎంపిక చేయాలని అనుకుంటోంది. ఇదే సమయంలో టీమిండియా వన్డేలు, టీ20 మ్యాచ్ లు కూడా ఆడనుంది.
కాగా విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో ఛటేశ్వర్ పుజారాను తీసుకునే అవకాశం లేక పోలేదు.
ఇప్పటికే స్టార్ హిట్టర్ గా పేరు పొందిన సంజూ శాంసన్(Sanju Samson) గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కేవలం దేశీ వాళీ లేదా ఐపీఎల్ లో మాత్రమే దర్శనం ఇస్తున్నాడు. ఇక భారత జట్టు విండీస్ టూర్ లో భాగంగా 2 టెస్టు మ్యాచ్ లు, 3 వన్డే మ్యాచ్ లు , 5 టీ20 మ్యాచ్ ల సీరీస్ ఆడనుంది.
అవసరమైన సమయంలో వికెట్ కీపర్ గా కూడా సంజూ శాంసన్ పనికొస్తాడని బీసీసీఐ అతడిని ఎంపిక చేయాలని అనుకుంటోంది. కొంత మంది సీనియర్ ఆటగాళ్లు లేక పోవడంతో శాంసన్ కు ఛాన్స్ దక్కనుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా చివరిసారిగా సంజూ శ్రీలంకతో టీ20 మ్యాచ్ ఆడాడు.
Also Read : Manipur Violence Comment : మణిపూర్ లో ఆరని మంటలు
