Chandra Babu Case : చంద్ర‌బాబు కేసుపై కోర్టు విచార‌ణ

ఏపీ స్కిల్ స్కాం కేసులో వాద‌న‌లు

Chandra Babu Case : విజ‌యవాడ – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు , ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ కేసుకు సంబంధించి రూ. 371 కోట్లు చేతులు మారాయ‌ని, హవాలా రూపంలో తిరిగి బాబు అనుయాయుల‌కు ముట్టాయ‌ని ఏపీ సీఐడీ ఆరోపించింది.

Chandra Babu Case Updates

ఈ మేర‌కు కేసు న‌మోదు చేసింది. ఈ కేసుతో పాటు మ‌రో రెండు కేసులు న‌మోదు చేసింది సీఐడీ. ఏపీ ఫైబ‌ర్ నెట్ స్కాంతో పాటు అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసు కూడా చంద్ర‌బాబు నాయుడుపై మోపింది.

గ‌త నెల అక్టోబ‌ర్ 9న ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్ర‌బాబు నాయుడును(Chandrababu) నంద్యాల‌లో అరెస్ట్ చేసింది. అక్క‌డి నుంచి నేరుగా ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌ర్చింది. కేసుకు సంబంధించి పూర్తి నివేదిక‌ను స‌మ‌ర్పించ‌డంతో ఏసీబీ కోర్టు జ‌డ్జి హిమ బిందు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు రిమాండ్ విధించింది.

దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయినా విచార‌ణ వాయిదా ప‌డింది. తాజాగా చంద్ర‌బాబు త‌ర‌పు లాయ‌ర్లు కాల్ డేటా రికార్డులు ఇవ్వాల‌ని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు.

Also Read : BS Yediyurappa : యెడ్డీకి జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ

Leave A Reply

Your Email Id will not be published!