Chandra Babu Naidu : 2న చంద్రబాబు నిరాహార దీక్ష
టీడీపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు
Chandra Babu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ డెవలప్మెమెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టనున్నారని ఏపీ టీడీపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Chandra Babu Naidu Strike Viral
ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడును కక్ష సాధింపుతో కేసు నమోదు చేశారని ఆరోపించారు. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సర్కార్ అక్రమ కేసు బనాయించడాన్ని నిరసిస్తూ రాజమండ్రి జైలు లోనే నిరాహార దీక్ష చేపడతారని స్పష్టం చేశారు కింజారపు అచ్చెన్నాయుడు.
అదే రోజు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సతీమణి, నారా లోకేష్ తల్లి, నారా బ్రాహ్మణి అత్త గారైన నారా బ్రాహ్మణి కూడా తన భర్త అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ దీక్ష చేపడతారని వెల్లడించారు.
కేవలం కక్ష సాధింపు ధోరణితోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రజలు తగిన రీతిలో జగన్ రెడ్డికి బుద్ది చెప్పడం ఖాయమన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో శ్రేణులు కూడా నిరాహార దీక్షలో పాల్గొంటారని తెలిపారు టీడీపీ చీఫ్. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
Also Read : ACB Raids : మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో నోట్ల కట్టలు