Chandra Bose : తన గ్రామానికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న రచయిత చంద్రబోస్
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఆయన రాసిన నాటు.. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం..
Chandra Bose : ఆస్కార్ అవార్డు గ్రహీత సినీ గీత రచయిత కనుకుంట్ల చంద్రబోస్ గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జయశంకర్ భూపలపల్లి జిల్లా చిచ్చర మండలం చల్లగరిగ గ్రామంలో సొంత డబ్బుతో ఆస్కార్ పేరిట గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ ఆస్కార్ లైబ్రరీ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రబోస్ బుధవారం మాట్లాడారు. ’’ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లగరిగలోని తన ఇంటి పక్కనే ఉన్న గ్రంథాలయంలో ఎన్నో సాహిత్య పుస్తకాలు చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నానన్నారు.
Chandra Bose Comment
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఆయన రాసిన నాటు.. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం తనకు గర్వకారణమని చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యాధునిక వసతులతో కూడిన గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని ఆ రోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. అందరి సహకారంతో 36 లక్షల వ్యయంతో ఎనిమిది నెలల్లో ఈ భవనాన్ని పూర్తి చేసి “ఆస్కార్ లైబ్రరీ”గా నామకరణం చేశామని చెప్పారు.ఇదే సమయంలో రచయిత చంద్రబోస్ తన సొంత డబ్బుతో నిర్మించిన ఆస్కార్ లైబ్రరీ ప్రారంభోత్సవ వేడుక గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత తెలిపారు.
Also Read : CM Chandrababu : ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ