Chandrababu Naidu : జగన్ రూ. 40 వేల కోట్ల దోపిడీ
నారా చంద్రబాబు నాయుడు ఫైర్
Chandrababu Naidu : టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ. 40 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఇసుక సహజ సంపద అని దానిని కూడా వదిలి పెట్టడం లేదన్నారు.
Chandrababu Naidu Comments Viral
ప్రజలకు చెందాల్సిన సంపదను వైసీపీ నేతలు అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). ఇసుక మీద ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చర్యల కారణంగా వారంతా రోడ్డు పాలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మాణ రంగానికి చేయూత ఇచ్చామని కానీ జగన్ రెడ్డి వచ్చాక వారి పాలిట శాపంగా మారారని మండిపడ్డారు. తప్పుడు వాగ్ధానాలతో జగన్ పవర్ లోకి వచ్చాడని, ఆ తర్వాత రాజారెడ్డి రాజ్యాన్ని కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు నారా చంద్రబాబు నాయుడు.
ఇసుక దోపిడీతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయిందన్నారు. ఇసుకను తోడడం వల్ల ప్రాజెక్టులు కుంగి పోతున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి వ్యాపార అనుభవం లేని జేపీ పవర్ వెంచర్స్ కు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. వాటాలో తేడా రావడంతో టర్న్ కీ సంస్థను బయటకు గెంటేశారంటూ ఆరోపించారు.
Also Read : Jupudi Prabhakar Rao : తెలుగు రాష్ట్రాలకు పట్టిన శని రామోజీ